వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరదా వ్యాఖ్య: మూడ్రోజులు జైల్లో సిక్కు బాలుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో భారతీయ సిక్కు అయిన పన్నెండేళ్ల బాలుడు మూడు రోజుల పాటు జైలులో ఉండవలసి వచ్చింది. క్లాస్‌మేట్ ఒకరు అతని వద్ద బాంబు ఉందని చెప్పడంతో మూడు రాత్రుల్లు జైలులో ఉన్నాడు.

ఆ సిక్కు బాలుడి పేరు అర్మాన్ సింగ్ సరాయి. అతను సరదాగా చేసిన వ్యాఖ్యలకు మూడ్రోజులు జైలు జీవితం గడపవలసి వచ్చింది. అతనిని బాల నేరస్థుల గృహంలో నిర్బంధించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

 12 year old Sikh boy arrested in US after classmate accuses him of carrying a bomb

డల్లాస్‌లోని నికోల్స్ జూనియర్ హైస్కూల్లో చదువుతున్న అర్మాన్ సింగ్ సరాయ్ ఓ రోజు స్నేహితులను ఆట పట్టించేందుకు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పాడు. ఇది విన్న తోటి విద్యార్థి అర్మాన్‌ను ఏడిపించాలనుకున్నాడు.

అర్మాన్ దగ్గర బాంబు ఉందని, పాఠశాలను పేల్చేయాలని చూస్తున్నాడని ఉపాధ్యాయురాలికి చెప్పాడు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం వెళ్లింది. అర్మాన్‌ను పోలీసులకు అప్పగించారు. అతనిని స్టేషన్లో విచారించి, మూడు రోజుల పాటు బాల నేరస్థుల గృహంలో ఉంచారు. ఈ విషయాన్ని అర్మాన్ కజిన్ ఫేస్‌బుక్‌లో పెట్టడంతో విషయం వెలుగు చూసింది.

English summary
Armaan Singh Sarai, a 12-year-old boy from an American-Sikh family, was arrested by the Dallas police on December 11 and held for three consecutive days after he was accused by a “bully” in his class of carrying a bomb to school, claims his cousin in a Facebook post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X