వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవ తప్పిదానికి మెక్సికోలో 124 మొసళ్లు మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మానవ తప్పిదం కారణంగా మెక్సికోలో 124 మొసళ్లు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే... 350 మొసళ్లను ఓ ట్రక్కులో తరలిస్తుండగా అవి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కరేబియన్ తీరానికి చెందిన క్రోకోడ్రిలోస్ ఎక్సోటికోస్ అనే కంపెనీ ఈ మొసళ్లను తరలిస్తోంది.

సినలోవా నుంచి చెటుమాల్ పట్టణానికి మొసళ్లను తరలించే క్రమంలో ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య సుమారు 2550 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మెక్సికోలోని పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వైపు సుమారు 350 మొసళ్లతో ఈ ట్రక్కు బయల్దేరింది.

124 Crocodiles Suffocate In Mexico Truck Trip

అంత దూరం సరైన రీతిలో మొసళ్లను తరలించకపోవం వల్లే మొసళ్లు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కంపెనీపై పర్యావరణశాఖ వన్యప్రాణి చట్టం ప్రకారం భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. మొసలి సంరక్షణ కేంద్రానికి సుమారు 5000 మొసళ్లను తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

English summary
More than 120 crocodiles died from apparently suffocating and crushing each other while being transported across Mexico in a truck, authorities said on Wednesday. The wildlife company Cocodrilos Exoticos, based in the Caribbean coast state of Quintana Roo, could face a fine of between 50 to 50,000 days of minimum wage -- $193 to $193,000, the environmental prosecutor's office said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X