వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్చరికలు బేఖాతరు: అమెరికాకు షాకిచ్చిన భారత్ సహా 128 దేశాలు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: జెరూసలేం విషయంలో అమెరికాకు ఐక్యరాజ్య సమితిలో చుక్కెదురైంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ చేసిన తీర్మానానికి భారీ మద్దతు లభించింది.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో గురువారం ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్ సహా 128 దేశాలు ఓటు వేశాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాలకు అమెరికా ఆర్థిక సహాయంలో కోత పెడతామని ట్రంప్ హెచ్చరించారు.

128 countries including India vote to reject US Jerusalem decision

అయినప్పటికీ ఆ బెదిరింపులను పట్టించుకోలేదు ఈ 128 దేశాలు. ట్రంప్ హెచ్చరికల ప్రభావం స్వల్పంగా మాత్రమే కనిపించింది. కేవలం 9 దేశాలు మాత్రమే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి.

అయితే అమెరికాకు మిత్ర దేశాల్లో కొన్ని పాశ్చాత్య, అరబ్ దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. 35 దేశాలు ఓటింగ్‌ నుంచి గైర్హాజరయ్యాయి.

English summary
India on Thursday joined 127 other countries to vote in the United Nations General Assembly in favour of a resolution opposing the recent decision of US President Donald Trump to recognise Jerusalem as Israel's capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X