• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బార్ లో బర్త్ డే పార్టీ: 13 మంది సజీవదహనం

|

ప్యారిస్: పుట్టిన రోజు వేడుకల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది మరణించారు. సంతోషంగా గడుపుతున్న వారు ఒక్క సారిగా మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. ప్యారిస్ లోని రోవన్ నగరంలో ఈ దుర్ఘటన జరిగింది.

ఉత్తర ప్యారిస్ లోని రోవన్ నగరంలోని ఓ బార్ లో యువకుడి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. ఆ యువకుడి స్నేహితులు అందరూ పార్టీకి హాజరైనారు. అర్దరాత్రి సమయంలో బార్ లో బర్త్ డే పార్టీ జోరుగా జరుగుతున్నది.

ఆ సందర్బంలో బార్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. బర్త్ డే పార్టీలో ఉన్న వారు బయటకు పోలేక అక్కడే సజీవదహనం అయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

అనేక మందికి గాయాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి ఉగ్రవాదుల హస్తం లేదని, ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని స్థానిక మీడియా తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది.

English summary
The fire started around midnight at a bar where young people had been gathering to celebrate a private birthday party in the northern city of Rouen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X