వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రెజిల్ లో 131 ఏళ్ల వయస్సు వృద్దుడు

|
Google Oneindia TeluguNews

బ్రెజిల్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు ఉన్న వృద్దుడు బ్రెజిల్ ఉన్నారని అక్కడి ప్రజలు గుర్తించారు. ఆయన వయస్సు 131 సంవత్సరాలు. ఆయన 69 ఏళ్ల భార్య, ముగ్గురు పిల్లలు, మనుమరాళ్లతో కలిసి జీవిస్తున్నారని బ్రెజిల్ సామాజిక భద్రతా కార్మికులు వెలుగులోకి తీసుకు వచ్చారు.

ఆ వృద్దుడి పేరు డిసౌజా (131) అని చెప్పారు. గతంలో 122 ఏళ్ల వయస్సు ఉన్న జెన్నే కాల్మెంట్ అత్యంత వృద్దురాలిగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈమె 1997వ సంవత్సరంలో మరణించారు. ప్రస్తుతం జపాన్ లో 112 ఏళ్ల వయస్సు ఉన్న యజుతారో కోయిడే అనే వృద్దురాలు జీవిస్తున్నారు.

ఉత్తర బ్రెజిల్ లోని యాకర్ కు సుమారు రెండు వేల కీలోమీటర్ల దూరంలోని సియారా మెరౌకా నగరంలో జోవో కోయెల్హో డిసౌజ 1884 మార్చి 10వ తేదిన జన్మించారని రికార్డులు చెబుతున్నాయి. ఈ వివరాలు, ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు.

 A 131-year-old Grandfather in Brazil

ప్రస్తుతం సెనా మడెరెయిరా నుంచి 30 నిమిషాల పడవ ప్రయాణం అనంతరం వచ్చే యాకర్ రాష్ట్ర మధ్య భాగంలోని అల్కంటారా ఎస్టిరావో గ్రామంలో డిసౌజా భార్య, కుమార్తెలు, మనవరాళ్లతో కలిసి నివాసం ఉంటున్నారని గుర్తించారు.

డిసౌజా పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని బ్రెజిల్ ప్రజలు అక్కడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారు. డిసౌజా పూర్తి వివరాలు సేకరించాలని బ్రెజిల్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఎప్పుడు పుట్టారు అని వివరాలు సేకరిస్తున్నామని అధికారులు అంటున్నారు.

English summary
The document showed he was born in the city of Meruoca in Ceara nearly 2,000 miles to the east of Acre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X