• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌తో సైడ్‌ఎఫెక్ట్స్ - మంచం పట్టిన 14 శాతం వాలంటీర్లు - రష్యా మంత్రి వెల్లడి

|

పాండమిక్(మహమ్మారి) ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో.. దాన్ని నియంత్రించడానికి ప్రపంచం ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలో రోజులు గడిచేకొద్దీ అందరికీ అవగతమవుతున్నది. కొవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నవేళ వ్యాక్సిన్ ప్రయోగాలకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీలో ఫ్రంట్ రన్నర్ గా పేరుపొందిన 'ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్' క్లినికల్ ట్రయల్స్ ఇటీవల కొంతకాలంపాటు నిలిచిపోగా.. ఇప్పుడు రష్యా తయారీ 'స్పుత్నిక్-వి'కి సంబంధించి మరో చేదువార్త వెలుగులోకి వచ్చింది.

కరోనాపై చైనా మరో సంచలన ప్రకటన-గత ఏప్రిల్‌లోనే వ్యాక్సిన్ రెడీ-అందరికీ వద్దు -సైడ్ ఎఫెక్ట్స్: సీడీసీ

స్పుత్నిక్‌తో సైడ్ ఎఫెక్ట్స్?

స్పుత్నిక్‌తో సైడ్ ఎఫెక్ట్స్?

ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ గా రష్యా పరిచయమైన ‘స్పుత్నిక్-వి' ఓవైపు తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగానే.. మార్కెట్ లోకి విడుదల చేసేశారు. గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రాలజీ అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి' అన్ని రకాల క్వాలిటీ టెస్ట్‌లలో పాసైందని, అందుకే మొదటి బ్యాచ్ ను మార్కెట్‌లోకి విడుదల చేశామని రష్యా ఆరోగ్యశాఖ గత వారం ఒక ప్రకట చేసింది. కానీ, సదరు వ్యాక్సిన్ తో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తినట్లు తాజాగా ప్రభుత్వమే మరో ప్రకటన చేసింది.

14 శాతం మందికి అనారోగ్యం..

14 శాతం మందికి అనారోగ్యం..

స్పుత్నిక్-వి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వివిధ కారణాలతో అనారోగ్యానికి గురయ్యారని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురష్కో మంగళవారం మీడియాకు తెలిపారు. ‘‘ట్రయల్స్ లో భాగంగా 300 మందికిపైగా వాలంటీర్లకు టీకాలు వేశాం. అందులో 14 శాతం మంది రకరకాల ఇబ్బందులకు లోనయ్యారు. కొందరికి అలసట, ఇంకొందరికి కండరాల నొప్పులు కలగ్గా, మరికొందరిలో శరీర ఉష్ణోగ్రత పెరిగింది'' అని మంత్రి వివరించారు.

సేఫ్టీఫై అనుమానాలు వద్దు..

సేఫ్టీఫై అనుమానాలు వద్దు..

క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొని, వ్యాక్సిన్ డోసు వల్ల అస్వస్థతకు గురైన వాలంటీర్లను ఆయా సెంటర్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని, నిజానికి వారికి తలెత్తినవి చిన్న సమస్యలేనని, వ్యాక్సిన్ మాన్యువల్ లోనూ ఇలా జరగొచ్చని రాసుందని, కాబట్టి స్పుత్నిక్-వి సేఫ్టీపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ స్పష్టం చేశారు.

  Rajnath Singh Meets Wei Fenghe చైనా రక్షణ మంత్రితో డ్రాగన్ తీరును ఏకిపారేసిన రాజ్‌నాథ్ || Oneindia
  కొద్దిరోజుల్లో దేశమంతటా.. ఆపై భారత్‌కు?

  కొద్దిరోజుల్లో దేశమంతటా.. ఆపై భారత్‌కు?

  ఓవైపు క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగానే స్పుత్నిక్-వి పంపిణీని ప్రారంభించిన రష్యా ప్రభుత్వం.. మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా అందరికీ డోసులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కోసం అనేక దేశాలు క్యూ కట్టినట్టు కూడా అక్కడి ప్రభుత్వం తెలిపింది. కాగా, స్పుత్నిక్ వ్యాక్సిన్ కు సంబంధించి రష్యా-భారత్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. రష్యాలో స్పుత్నిక్-వి క్లినికల్ ట్రయల్స్ రెండు దశల్లో మాత్రమే పూర్తికావడంతో.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ భారత్‌లో చేపట్టాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇంకొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.

  English summary
  Over 300 volunteers have been inoculated during the post-registration trials of Russia's Covid-19 vaccine, dubbed Sputnik V, around 14 percent of them have reported fatigue, muscle pain or high body temperature, Russian Health Minister Mikhail Murashko said on Tuesday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X