వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెక్సికోను వణికించిన భూకంపం: 149 మందికిపైగా మృతి

మెక్సికోను భూకంపం వణికించింది. భూకంపంతో మెక్సికో అతలాకుతలమైంది. మంగళవారం సంభవించిన దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.1గా నమోదయింంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Mexico Earthquake : మెక్సికోను వణికించిన భూకంపం (Video) | Oneindia Telugu

మెక్సికో: మెక్సికో నగరాన్ని భూకంపం వణికించింది. భూకంపంతో మెక్సికో అతలాకుతలమైంది. మంగళవారం సంభవించిన దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.1గా నమోదయింంది. ప్రకంపనల ధాటికి 44కి పైగా భవనాలు కూలిపోయాయి. మెక్సికో కాలమాన ప్రకారం మధ్యాహ్నం సంభవించింది. పగటిపూట కావడంతో ప్రాణ నష్టం తక్కువగా ఉందని భావించారు.

మెక్సికో నగరంలోనే పలు చోట్ల జనం భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. 149 మందికి పైగా మృతి చెందినట్లు గుర్తించారు. చాలా మంది ఆచూకీ లబించడం లేదు. వంద‌లాది మంది శిథిలాలకింద ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రాణ‌, ఆస్తిన‌ష్టం భారీగా ఉంటుంది. శిథిలాలు పూర్తిగా తొల‌గిస్తేకానీ ప్రాణ‌, ఆస్తి న‌ష్టంపై ఓ అంచ‌నాకు రాలేమ‌ని అధికారులు చెబుతున్నారు.

Earthquake

మెక్సికో న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న కాండెసా ప్రాంతంలోని ఐదంత‌స్థుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఘ‌ట‌నాస్థ‌ల‌కి చేరుకున్న స‌హాయ‌క సిబ్బంది ప‌లువురిని ర‌క్షించారు. భూకంపం వ‌ల్ల గ్యాస్ పైప్‌లైన్లు దెబ్బ‌తిన్న‌ట్లు అధికారులు భావిస్తున్నారు.

క్యూయెర్‌న‌వాకా ప్రాంతంలోని పాఠ‌శాల భ‌వ‌నం కుప్ప‌కూలింది. దీంతో పాఠశాల‌లోని పిల్లలు, ఉపాధ్యాయుల ఆచూకీ తెలియ‌డం లేదు. ఇక్కడ వారం రోజుల క్రితమే భారీ భూకంపం సంభవించింది విద్యుత్‌ లైన్లు, ఫోను లైన్లు అనేకచోట్ల ధ్వంసమయ్యాయి.

స‌రిగ్గా 32ఏళ్ల‌క్రితం 1985 సెప్టంబ‌రు 19న‌ ఇదే రోజు మెక్సికోలో భూకంపం సంభవించి 10 వేల మంది చనిపోయారు. పెనువిప‌త్తుకు గురైన మెక్సికోకు అండ‌గా ఉంటామ‌ని అమెరికా అధ్య‌క్షుడు ‌ట్రంప్ భ‌రోసా ఇచ్చారు. భూకంపం ధాటికి తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి రావ‌డంతో సహాయ‌క చ‌ర్య‌లకు కొంత ఆటంక‌మేర్ప‌డింది.

English summary
A powerful earthquake shook central Mexico on Tuesday which has left 100 dead. Severe damage was caused to buildings in the country on the anniversary of a 1985 earthquake that inflicted major damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X