వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘హెచ్ -1 బీ’ ఉల్లంఘించిన 15 సంస్థలపై కొరడా.. ఆర్బీఐ వైఖరి సరైందేనన్న నిపుణులు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పర్యాటకులు, తమ దేశంలో ఉద్యోగం కోసం వచ్చే వలస కార్మికులపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి టెక్కీలకు వినియోగించే 'హెచ్ -1బీ' వీసాలపై కఠిన ఆంక్షల అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిని ఏమాత్రం క్షమించే ప్రసక్తే లేదని సంకేతాలిస్తున్నారు. అందులో భాగంగా టెక్కీల వినియోగంలో నిబంధనలను ఉల్లంఘించిన 15 సంస్థలను ఇక హెచ్ -1బీ వీసా దరఖాస్తు చేసుకునేందుకు అనర్హత జాబితాలో చేర్చినట్లు కార్మికశాఖ వేజ్ అడ్ అవర్ డివిజన్ ప్రకటించింది.
ఈ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నట్లు భారతదేశంతోపాటు ఏ దేశ వలస కార్మికుడు దరఖాస్తు చేసుకున్నా అనర్హత వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. సదరు సంస్థల యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించిందని లేబర్ డిపార్ట్ మెంట్ నిగ్గు తేల్చింది. గత ఐదేళ్లుగా నిర్వహించిన సర్వేలో సదరు సంస్థలు పదేపదే నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడానికే ప్రాదాన్యం ఇచ్చాయని తేలింది.

ఆ కంపెనీలపై ఈ నెల ఒకటి నుంచి నిషేధం అమలు

ఆ కంపెనీలపై ఈ నెల ఒకటి నుంచి నిషేధం అమలు

అమెరికా కార్మికశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉద్దేశపూర్వకంగా సమాచార వెల్లడిలో వైఫల్యం గానీ, సమాచారం సమర్పించడంలో తప్పుడు సమాచారం ఇచ్చినా సదరు సంస్థలు ‘హెచ్-1బీ' వీసా కింద విదేశీ ఉద్యోగుల నియామకానికి అనర్హులు. అమెరికాలో విదేశీ ఉద్యోగులు పనిచేయడానికి హెచ్ -1బీ నాన్ ఇమ్మిగ్రేంట్ వీసా అనుమతినిస్తుంది. ఏటా భారత్, చైనా నుంచి వేల మంది ఈ వీసా కింద వెళుతుంటారు. హెచ్ -1 బీ వీసాలు ప్రత్యేక రంగంలో నైపుణ్యం సంపాదించిన వారికి మాత్రమే ప్రత్యేకించి సైన్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సులు తెలిసిన వారికి మాత్రమే అనుమతినిస్తాయి. ప్రతియేటా అమెరికా లాటరీ ద్వారా 65 వేల మంది హెచ్ - 1 బీ వీసా అందజేస్తున్న సంగతి తెలిసిందే.

 ఈ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తే హెచ్ -1బీ వీసా అనుమానామే

ఈ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తే హెచ్ -1బీ వీసా అనుమానామే

ఈ జాబితా 2018 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని అమెరికా కార్మిక శాఖ పేర్కొన్నది. ఉద్దేశపూర్వకంగా హెచ్ -1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించిన సంస్థల వివరాలిలా ఉన్నాయి: అజెల్ టెక్నాలజీస్ అండ్ శ్రీనివాస్ అరికట్ల, అమికా టెక్నాలజీ సొల్యూషన్స్, క్లిన్రన్ ఎల్ఎల్సీ, డెల్టా సెర్చ్ ల్యాబ్స్, ఫాస్కామ్ డిజిటల్, జీ హెల్త్ కేర్, ఇంకోల్న్ కార్పొరేషన్, మాక్రో నెట్ వర్క్స్ కార్పొరేషన్, ఎండీ2 సిస్టమ్స్, నిచె సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, నార్త్రన్ కాలిఫోర్నియా యూనివర్శల్ ఎంటర్ ప్రైజెస్, ఎన్వైసీ హెల్త్ కేర్ స్టాఫింగ్, రియాడ్ స్ట్రా డెయిరీ, టెకీవేర్ సొల్యూషన్స్, టెలావా నెట్ వర్క్స్ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నా.. చేయాలని సంకల్పించినా అనర్హత వేటు పడుతుందని అమెరికా కార్మికశాఖ హెచ్చరించింది.

ద్రవ్యోల్బణ నియంత్రణపైనే ప్రధానంగా ఆర్బీఐ ఫోకస్

ద్రవ్యోల్బణ నియంత్రణపైనే ప్రధానంగా ఆర్బీఐ ఫోకస్

ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెండు రోజుల క్రితం వడ్డీరేట్లు (రెపోరేట్) యధాతథంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం సరైందేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2010 నవంబర్ తర్వాత అతి కనిష్ఠ స్థాయిలోనే వడ్డీరేట్లు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. బారత ఆర్థిక ప్రగతి కోణంపై తటస్థ వైఖరి ప్రదర్శించిన ఆర్బీఐ వరుసగా మూడో సమీక్షలోనూ యధాతథంగా వడ్డీరేట్లు కొనసాగించాలని నిర్ణయించింది. ఫిలిప్ క్యాపిటల్ ఇండియా ఆర్ధిక వేత్త అంజలీ వర్మ మాట్లాడుతూ ద్రవ్య పరపతిని సమీక్షించిన ఆర్బీఐ వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తూ సరైన వైఖరే ప్రదర్శించిందన్నారు. అధిక ద్రవ్యోల్బణం నమోదవుతుందన్న సంకేతాల మధ్య వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగించే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇక్రా ప్రిన్సిపల్ ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ మధ్యకాలిక ద్రవ్యోల్బణం నాలుగు శాతం సాధించాలన్న లక్ష్యంతోనే వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నదన్నారు. సింగపూర్ డీబీఎస్ గ్రూప్ ఎకనమిస్ట్ రాధికారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సర వ్రుద్ధి రేటును ఏడు శాతంగా నిర్దేశించుకోవడం ఆశావాహ ద్రుక్పథమైనా.. ఆర్బీఐ మాత్రం తనకు అందుబాటులో ఉన్న డేటాకు అనుగుణంగానే దవ్రోల్బణాన్ని కట్టడి చేయడానికే ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.

English summary
The United States Department of Labor has recently released a list of 15 employers who cannot apply for H-1B visas, which are much-sought after by techies all around the world, including India. The Wage and Hour Division of the Department of Labor termed the companies as "wilful violator employers" on its website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X