• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిమ్ రూల్స్: ఫోర్న్ మూవీస్ చూసినా, జుట్టు పెంచుకొన్నా శిక్షే

By Narsimha
|

ప్యాంగ్యాంగ్: ప్రపంచాన్నే తాను తాను పరిపాలిస్తున్న దేశ ప్రజలకు కూడ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ చుక్కలు చూపిస్తున్నారు. ఆ దేశంలో అమలు చేసే కఠిన నిర్ణయాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యర్థులను నాశనం చేస్తాం, హైడ్రోజన్ బాంబు రె'ఢీ' చేసిన కిమ్

ప్రభుత్వం అమలు చేసే నిర్ణయాలను పాటించకపోతే కఠినంగా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది.దీంతో ఉత్తరకొరియా ప్రజలు కూడ ఈ నిబంధనలను అనివార్యంగా పాటిస్తారు.

ప్రపంచానికి ఉత్తరకొరియాతో ముప్పు:యుకివా ప్రపంచానికి ఉత్తరకొరియాతో ముప్పు:యుకివా

ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించకూడదు. ప్రభుత్వం సూచించినట్టుగానే ప్రజలు నడుచుకోవాలి. కనీసం రేడియో, టివి లాంటి వినోదం విషయంలో కూడ ప్రభుత్వం చెప్పినట్టుగానే నడుచుకోవాలి.

కిమ్‌కు షాక్: నార్త్ కొరియాపై బాంబు దాడి, సూపర్ బాంబు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు

ఆఖరుకు ప్రభుత్వం నిర్ధేశించిన హెయిర్ కటింగ్ సెలూన్లలోనే జుట్టును కత్తిరించుకోవాలి. లేకపోతే ఇక అంతే. ఈ తరహ విధానాలను నియంత కిమ్ తన దేశంలో అమలు చేస్తున్నారు. ఈ దేశంలో ఎవరైనా అడుగపెట్టాలంటే కూడ ఈ నిబంధలను పాటించాల్సిందే.

కఠిన నిర్ణయాలు అమలు చేస్తోన్న కిమ్

కఠిన నిర్ణయాలు అమలు చేస్తోన్న కిమ్

ఉత్తరకొరియా అధ్యక్షుడు తమ దేశంలో కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. పౌరులెవరైనా సరే తమ ఇంట్లోని రేడియో సౌండ్ పెంచకూడదు. అలా అని తగ్గించకూడదు. ఈ రేడియో సర్కారు నియంత్రణలో పనిచేస్తుంది. దీనికి విరుద్దంగా పనిచేస్తే ఇక అంతే సంగతులు. ఇక టీవి ప్రసారాలన్నీ కూడ ప్రభుత్వం నియంత్రిస్తోంది. దేశంలోని న్యూన్ పేపర్లు, మ్యాగజైన్లలో ఇతర దేశాల వార్తలు ప్రచురించకూడదు.

ప్రభుత్వం సూచించిన హెయిర్ సెలూన్లలోనే హెయిర్ కట్

ప్రభుత్వం సూచించిన హెయిర్ సెలూన్లలోనే హెయిర్ కట్

ప్రజలంతా ప్రభుత్వ గుర్తింపు పొందిన 28 హెయిర్ సెలూన్లలో మాత్రమే జుట్టును కత్తిరించుకోవాలి. మహిళలు కూడ తమ జుట్టును కత్తిరించుకోవాల్సి ఉంటుంది. అయితే వివాహం కాని మహిళలు ఓ రకంగా , వివాహమైన మహిళలు మరో రకంగా జుట్టు కత్తిరింపు చేసుకోవాలి. పురుషులకు కూడ ఇదే నియమం ఉంటుంది. వివాహం కాని మహిళలు జుట్టును పొట్టిగా కత్తిరించుకోవాలి. వివాహమైనా మహిళలు తమ జుట్టును ఇష్టమొచ్చినట్టు అలంకరించుకోవచ్చు. వివాహం కాని పురుషులైతే 2 అంగుళాల కంటే తక్కువ పొడవులో జుట్టును ఉంచుకోవాలి. వివాహమైన పురుషులైతే రెండున్నర అంగుళాల కంటే ఎక్కువ జుట్టును పెంచుకొనే వెసులుబాటు ఉంది.దేశాధినేత హెయిర్‌స్టైల్‌ను అందరూ అనుసరించాల్సిందే.

ఫోర్న్ మూవీస్ చూస్తే సెలవు రద్దు

ఫోర్న్ మూవీస్ చూస్తే సెలవు రద్దు

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ఫోర్న్ మూవీస్ చూస్తే వారాంతపు సెలవు రద్దు. వచ్చేవారం రోజులు తప్పనిసరిగా పనిచేయాలి.ఎవరూ నీలిరంగు జీన్స్ ధరించకూడదు. ఇలా ధరిస్తే దీనిని నేరంగా పరిగణిస్తారు. కాదని ఈ పనిచేస్తే కఠిన చర్యలు తప్పవు.దేశంలోని పేద ప్రజల ఫొటోలు ఎవరూ తీయకూడదు.

జూలై 8, 17 తేదిల్లో ఎటువంటి ఉత్సవాలు చేయరాదు

జూలై 8, 17 తేదిల్లో ఎటువంటి ఉత్సవాలు చేయరాదు

ప్రతి ఏటా జూలై 8, 17 తేదీల్లో ఎటువంటి ఉత్సవాలు నిర్వహించకూడదు. ఆ రోజుల్లో దేశాధినేతల వర్థంతులు నిర్వహిస్తారు.ఈ నియమాలను కాదని స్వంతంగా తమ ఇళ్ళలో ఉత్సవాలు నిర్వహించకూడదని కిమ్ ప్రజలను ఆదేశించారు. ఎవరూ వాహనాలు కొనుగోలు చేయకూడదు. ప్రభుత్వ, మిలటరీ అధికారులకు ఈ నియమం వర్తించదు.

పర్యాటకులు మొబైల్ తీసుకురావద్దు

పర్యాటకులు మొబైల్ తీసుకురావద్దు

ఉత్తరకొరియాకు వచ్చే పర్యాటకులకు కూడ నిబంధనలు వర్తిస్తాయి. మొబైల్‌ తీసుకువచ్చే పర్యాటకులను దేశంలోకి అనుమతించేది లేదు. మొబైల్ ఫోన్లను ఎయిర్ పోర్టులోఅప్పగించిన తరువాతే దేశంలో కాలుమోపాలి. తిరిగివెళ్లిపోయేటప్పుడు వాటిని తీసుకెళ్లవచ్చు.పొరుగు దేశంతో సంబంధాలు కలిగిన సినిమాలు చూడకూడదు.

బైబిల్‌ను తమతో పాటు ఉంచుకోకూడదు.

English summary
North Korea, in defiance of worldwide pressure, test-fired an Intercontinental Ballistic Missile in early July.The founder and first leader of North Korea, Kim Il Sung, created the country's policy of juche or "self-reliance," which cut off North Korea economically and diplomatically from the rest of the world, even in times of great need, such as famines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more