• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో సరికొత్త సంక్షోభం: ప్రతి పది మందిలో ఒకరు: కరోనా అవుట్ బ్రేక్ తరువాత కోటిన్నర మందికి పైగా.

|

న్యూయార్క్: కరనా వైరస్ విలయతాండవం చేస్తోన్న అమెరికాలో సరికొత్త సంక్షోభం పుట్టుకొచ్చింది. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే అమెరికా కుదేలైంది. వైద్య రంగం మినహా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలే దశకు చేరుకుంది. ఫలితంగా తలెత్తిన ఈ సరికొత్త సంక్షోభాన్ని అమెరికా ఎలా ఎదుర్కొంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కరోనా వల్ల ఊపిరాడని స్థితికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

చైనా నెత్తిన కొత్త పిడుగు: జపాన్ కంపెనీలు గుడ్‌బై..తరలిపోవడానికి రెడీ: ఏకాకిని చేసే ప్రయత్నమా?చైనా నెత్తిన కొత్త పిడుగు: జపాన్ కంపెనీలు గుడ్‌బై..తరలిపోవడానికి రెడీ: ఏకాకిని చేసే ప్రయత్నమా?

1.66 కోట్ల మంది రోడ్ల మీదికి..

1.66 కోట్ల మంది రోడ్ల మీదికి..

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత..లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. నిరుద్యోగం అమాంతం పెరిగిపోయింది. నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1.66 కోట్లకు చేరుకుంది. మూడు వారాల వ్యవధిలోనే ప్రతి 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇప్పట్లో ఆగకపోవచ్చని, మరింతమంది తమ ఉద్యోగాలను కోల్పోవడానికి అవకాశం ఉందని చెబుతున్నారు.

మూత పడ్డ సంస్థలు..

మూత పడ్డ సంస్థలు..

అమెరికాలో ఇప్పటికే చాలా సంస్థలు మూతపడ్డాయి. ఈ నెల చివరినాటికి నిరుద్యోగుల సంఖ్య రెండు కోట్లకు పైగా చేరుకోవచ్చని అంటున్నారు. వైరస్ తీవ్రత తగ్గే సమయానికి నిరుద్యోగుల సంఖ్య ఎక్కడికి వెళ్లి ఆగుతుందనేది అంచనా కూడా వేయలేకపోతున్నామని అంటున్నారు. అమెరికాలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కరోనా వైరస్ వల్ల జన సంచారం భారీగా తగ్గింది. ఆదాయం లేకపోవడంతో రెస్టారెంట్లు, హోటళ్లు, సూపర్ మార్కెట్లు మూతపడ్డాయి.

అమెరికా వ్యాప్తంగా విస్తృతమైన లే ఆఫ్స్..

అమెరికా వ్యాప్తంగా విస్తృతమైన లే ఆఫ్స్..

అమెరికా వ్యాప్తంగా లే ఆఫ్స్ పెరిగాయి. మూడు వారాల వ్యవధిలో కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్, మస్సాచుసెట్స్ వంటి ప్రధాన నగరాల్లో డిపార్ట్‌మెంట్ స్టోర్స్ మూత పడ్డాయి. లే ఆఫ్స్ ప్రకటించాయి. రోడ్ ఐలండ్స్, మిన్నెసొటా, నెవడా, న్యూ హ్యాంప్‌షైర్, టెక్సాస్ వంటి నగరాలు కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా- వాటిల్లో పని చేసే చిరు ఉద్యోగులు ఉపాధిని కోల్పోయినట్టయింది. నిరుద్యోగుల కోసం అమెరికా ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలను ప్రకటించింది. వాటి కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నట్లు సీవీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ వెల్లడించింది.

వచ్చే నెలలో 15 శాతానికి పైగా నిరుద్యోగం..

వచ్చే నెలలో 15 శాతానికి పైగా నిరుద్యోగం..

వచ్చేనెల రోజుల్లో అమెరికాలో నిరుద్యోగుల శాతం 15 శాతానికి పైగా చేరుకునే అవకాశం ఉందని ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ బెత్ యాన్ బోవినో వెల్లడించారు. మరో కోటి 30 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతారని ఆమె తెలిపారు. 2009లో ఏర్పడిన ఆర్థికమాంద్యాన్ని మించిన పెను ప్రభావం చూపుతుందని అన్నారు. నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సెల్ప్ ఎంప్లాయిడ్స్ కూడా ఉన్నారని, వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారవచ్చని బోవినో అంచనా వేశారు. ఒక్క కాలిఫోర్నియాలోనే 27 శాతం మేరకు అంటే 8,50,000 మంది ఉద్యోగాలను కోల్పోవచ్చని చెప్పారు.

  కరోనా వైరస్ : America Reported 1,858 In Single Day, A Record High
  English summary
  Some analysts project that another record will be set by the number of claims filed for the week that ended April 4, which will be reported Thursday at 8:30 am. Jesse Edgerton, an economist at JPMorgan Chase, forecasts that 7 million people sought benefits that week.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X