షాకింగ్: ఆ ఆసుపత్రిలోని 16మంది నర్సులకు ఒకేసారి ప్రెగ్నెన్సీ
అరిజోనా: ఓ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్లోని 16 మంది నర్సులు ఒకేసారి గర్భం ధరించారు. అరిజోనాలోని మీసాలో గల బ్యానర్ డిజర్ట్ మెడికల్ సెంటర్లోని ఇంటెన్సివ్ కేర్లో పని చేస్తున్న వారంతా గర్భవతులు అయ్యారు. ఒకేచోట పని చేసే వీరందరికీ ఒకేసారి ప్రెగ్నెన్సీ రావడం గమనార్హం.
వారి ఫేస్బుక్ గ్రూప్ ద్వారా అందరి నర్సుల ప్రెగ్నెన్సీ విషయం తెలిసింది. ఇందులో చాలామంది నర్సులు అక్టోబర్ నుంచి జనవరి మధ్యన తమ పిల్లలకు జన్మను ఇవ్వనున్నారు. మరోవైపు నర్సులు అందరూ దాదాపు ఒకేసారి అందుబాటులో లేని పరిస్థితి ఉండటంతో ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది కొరత రాకుండా ప్లాన్ చేసుకుంది.
ప్రత్యామ్నాయంపై దృష్టి
తమ ఆసుపత్రిలోని ఐసీయు నర్సులు అందరూ దాదాపు ఒకేసారి సెలవులకు వెళ్లాల్సి రావడంపై ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ.. అందరికి ఒకేసారి ప్రెగ్నెన్సీ వచ్చి, సెలవులపై వెళ్లనున్నందున వారు సెలవులకు వెళ్లే రోజులలో ప్రత్యామ్నాంపై దృష్టి సారించామని చెప్పారు.
పదహారు మంది ప్రెగ్నెన్సీ విషయం చెప్పారు
ఆసుపత్రిలోని ఇతర నర్సులు (ప్రెగ్నెన్సీ రాని నర్సులు) ఇప్పటికే పేషెంట్లను చూసుకుంటున్నారు. ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ కలిగిన నర్సు రోచెల్లే షెర్మాన్ మాట్లాడుతూ.. ఫేస్బుక్ గ్రూప్లో తమ చాటింగ్ ద్వారా విషయం వెల్లడయ్యే వరకు ఈ విషయం తెలియదని అన్నారు. ఒకరి తర్వాత మరొకరు తమకు ప్రెగ్నెన్సీ అని చెప్పారని తెలిపారు.
కొందరి నర్సుల ప్రెగ్నెన్సీని పేషెంట్ల ఫ్యామిలీ అడిగింది
ఆసుపత్రిలోని పేషెంట్లు కొందరి నర్సులను పేషెంట్లుగా గుర్తించారు. నర్సులు షిఫ్టులుగా వస్తుంటారు. అలా కొందరు నర్సులు ప్రెగ్నెన్సీ కలిగి ఉన్నారని పేషెంట్లు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. తనను ఓ పేషెంట్ కుటుంబ సభ్యులు తన ప్రెగ్నెన్సీ గురించి అడిగారని ఓ నర్సు గుర్తు చేసుకున్నారు.
నర్సు సరదాగా
దీనిపై ఓ నర్సు చమత్కారంగా మాట్లాడుతూ.. మా అందరికీ ఒకేసారి ప్రెగ్నెన్సీ రావడం వెనుక ఓ రహస్య అజెండా ఉందని, మేమంతా ఒకేసారి సెలవులు తీసుకునేందుకు ఇలా చేశామని వ్యాఖ్యానించారు.