వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇజ్రాయిల్-గాజా సరిహద్దులో నిరసన: 16 మంది పాలస్తీనియన్ల మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

గాజా: ఇజ్రాయిల్- గాజా సరిహద్దులో పాలస్తీనియన్లు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.ఈ ఘర్షణల్లో సుమారు 16 మంది పాలస్తీన్ పౌరులు మరణించారు. మరో 1100 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఇజ్రాయిల్, పాలస్తీనియన్ల దళాల మధ్య చెలరేగిన గొడవల్లో 16 మంది పాలస్తీనియన్లు మరణించారు. శరణార్దులు తిరిగి ఇజ్రాయిల్‌కు తిరిగి వచ్చే విషయమై ఆరాు వారాల పాటు ఇజ్రాయిల్ -గాజా సరిహద్దుల్లో నిరసనలు చేపట్టాలని పాలస్తీనియన్లు పిలుపునిచ్చారు.

16 Killed, Dozens Wounded as Thousands Gather on Gaza-Israel Border for March of Return

ఈ మేరకు శనివారం నుండి ప్రారంభమైన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్ నుండి జెరూసలేంకు అమెరికా ఎంబసీని మార్చనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలను నిరసనకారులు దగ్ధం చేశారు. ఈ ఘటనపై సీరియస్‌గా తీసుకొంది. సుమారు 30 వేల మందిపై ఇజ్రాయిల్ సైన్యం డ్రోన్లను ఉపయోగించి వాయువులను ప్రయోగించింది.

ఇజ్రాయిల్ సరిహద్దులోని ఫెన్సింగ్‌కు హని కల్గించడం వల్లే ఆందోళనకారులపై కాల్పులకు దిగినట్టుగా ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. అయితే గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు ప్రకటించారు.

అయితే ఈ ఘటనలో సుమారు 16 మంది పాలస్తీనా పౌరులు మరణించడం విషాదం కల్గించింది. పాలస్తీనియన్లు చేపట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారడంతోనే దాన్ని అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు.

English summary
Around 30,000 Palestinians rallied throughout the Gaza Strip on Friday during the "March of Return," a series of mass protests along the Israel-Gaza border. At least 16 Palestinians have been killed and dozens wounded during clashes with Israeli soldiers over several hours, after a number of protesters threw stones and firebombs toward soldiers stationed along the fence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X