వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

56 కార్లు, ట్రక్కులు ఒకేచోట ఢీకొన్నాయి, 17 మంది మృతి

చైనాలోని ఓ హైవే పైన ఏకంగా 56 వాహనాలు ఢీకొన్నాయి. ఈ దారుణమైన సంఘటన చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో బీజింగ్ - కున్‌మింగ్ హైవే పైన చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలోని ఓ హైవే పైన ఏకంగా 56 వాహనాలు ఢీకొన్నాయి. ఈ దారుణమైన సంఘటన చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో బీజింగ్ - కున్‌మింగ్ హైవే పైన చోటు చేసుకుంది. రోడ్డు అంతా దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో కార్లు, భారీ వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. విషయం తెలియగానే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన పలు వాహనాల్లో మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేశారు.

highway in China

రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది. ఢీకొన్న 56 వాహనాలలో కార్లు, ట్రక్కులు ఉన్నాయి. సహాయక చర్యలకు పన్నెండు గంటలు పట్టింది. చాలా వాహనాలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి.

English summary
A total of 56 cars and trucks were involved in the massive pile-up after snowfall led to poor visibility and treacherous icy conditions on the Jingkun highway near Yangquan in Shanxi province, China National Radio reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X