వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో వింత: 17 ఏళ్ల అమ్మాయికి నాలుగు కిడ్నీలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బీజింగ్: సాధారణంగా మానవ జాతికి రెండు కిడ్నీలు ఉంటాయి. కానీ చైనాలో ఓ యువతికి నాలుగు కిడ్నీలు ఉన్న విషయం ఇటీవలే వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... చైనాకు చెందిన గ్జెలియన్‌ అనే 17 ఏళ్ల యువతి కొద్దిరోజులుగా వెన్నునోప్పితో బాధపడుతుండే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అల్ట్రాసౌండ్‌ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ అమ్మాయికి నాలుగు కిడ్నీలు ఉండడాన్ని గుర్తించిన వైద్యులు ఖంగుతిన్నారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వైద్య పరీక్షల అనంతరం ఈ వ్యాధిని రీనల్ డూప్లెక్స్ మాన్‌స్ట్రోసిటీగా గుర్తించారు.

17-year-old China girl found with four kidneys

ప్రతి 1500 మందిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుందని... అయితే ఈ వ్యాధితో బాధపడుతున్న చాలా మందికి తమకు నాలుగు కిడ్నీల విషయం తెలియదని యువతికి చికిత్స అందిస్తున్న డాక్టర్ తెలిపారు. అంతేకాదు అదనపు కిడ్నీలు శరీరంలో ఎటువంటి పనులు చేయవని.. ఇలాంటి కిడ్నీల వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదన్నారు.

దీంతో ఆమెకు యురిటెరల్‌ రిప్లాంటేషన్‌ శస్త్రచికిత్స చేసి అదనపు కిడ్నీలను తొలగించారు. వాస్తవానికి అదనంగా ఉన్న కిడ్నీలను తొలగించడం అంత సులభమైన పనికాదని డాక్టర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని చెప్పారు.

English summary
In a rare disorder, a 17-year-old Chinese girl has been found with four kidneys. Xiaolin was healthy all her childhood but visited hospital for treatment after having lower back pain regularly. An ultrasound she underwent showed her with four kidneys, leaving people shocked, state-run People’s Daily reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X