వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారీ.. అంటూ ప్రియురాలి శవంతో సెల్ఫీలు... ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌ను హత్య చేసిన ప్రియుడు...!

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా ఎంత త్వరగా మనుషులను ప్రభావితం చేస్తుందో అంతే త్వరగా చావుకు కూడ దగ్గర చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా పరిచయాలు స్టార్‌లతోపాటు సాధరణ మనుష్యులను కూడ ఇబ్బందులకు గురి చేస్తున్నాయయడంలో సందేహం లేదు. కొంతమంది వ్యక్తులు సోషల్ మిడియాలో వచ్చే టాలెంట్స్‌ను గుర్తించకుండా వ్యక్తిగత అవసరాలకోసమో, లేదంటే స్వార్థం కోసమో ఇతరులను బలి తీసుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.

ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం

ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం

రెండు నెలల క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై..అంతలోనే ఆమేపై మనసు పారేసుకుని, చివరికి ప్రాణం తీసిన యువకుడు ప్రియురాలి శవంతో సెల్ఫీలు తీసీ అదే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అమేరికా చెందిన యువకుడు. న్యూయార్క్ లోని యుటిక అనే ప్రాంతాలోని 17 ఏళ్ల బైనకా డెవిన్స్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా కొనసాగుతోంది.అయితే ఆమేతో రెండు నెలల క్రితమే 21ఏళ్ల బ్రాండన్ క్లార్క్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరు కలిసి చట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు కూడ తెలిసింది.

కలిసి కార్యక్రమానికి వెళ్లి ఉదయం శవంగా మారి..

కలిసి కార్యక్రమానికి వెళ్లి ఉదయం శవంగా మారి..

అయితే రెండు నెలల్లోనే క్లార్క్ తన ప్రతాపాన్ని చూపించాడు. న్యూ యార్క్ సిటిలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆదివారం ఇద్దరు కలిసి వెళ్లారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కాని తెల్లవారే సరికి ఇన్‌స్టా గ్రామ్‌ స్టారర్‌ను క్లార్క్ హత్య చేసి రోడ్డుపై పడేశాడు. అనంతరం తానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఇక స్పాట్ చేరుకున్న పోలీసులను చూసి తాను సైతం మెడపై కోసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ముందు ఫోన్ చేసిన క్లార్క్ దగ్గరికి వెళ్లిన పోలీసులు బైనకా శవాన్ని చూసి ఖంగుతిన్నారు.

క్షమించు.. మళ్లి కలసుకుందాం అంటూ రాతలు..

క్షమించు.. మళ్లి కలసుకుందాం అంటూ రాతలు..

అయితే అంతకుముందు క్లార్క్ ప్రియురాలిగా భావించిన బైనకాను చంపి శవంతో సెల్ఫీలు దిగాడు.ఫోటోపై సారీ అంటూ రాశాడు. దీంతో హింసాత్మకంగా ఉన్న ఫోటోలు సోషల్ మిడియాలో వైరల్ అయ్యాయి. ఈనేపథ్యంలోనే పోలీసులు ఆ ఫోటోలను తొలగించకపోవడంతో పలు విమర్శలు కూడ ఎదుర్కోన్నారు.ఇక గాయపడిన క్లార్క్‌ ప్రస్థుతం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు.

English summary
Seventeen-year-old Bianca Devins went to a concert in Queens, New York City with the 21-year-old Brandon Clark on Saturday night. The next morning she was found murdered near a black SUV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X