వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆసియా దేశాల ప్రతిష్టాత్మక క్రీడా సంబరానికి మొదలైంది. దక్షణి కొరియాలోని ఇంచియాన్‌లో ప్రారంభమైన 17వ ఆసియా గేమ్స్ క్రీడల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఇంచియాన్‌లోని అసద్ మెయిన్ స్టేడియంలో ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. 45 దేశాలు పోటీ పడే ఈ గేమ్స్‌లో 500 మందికి పైగా భారత అధ్లెట్లు 29 విభాగాల్లో సత్తా చూపనున్నారు. ఇంచియాన్ ఆసియా గేమ్స్‌లో పాల్గోనున్న భారతీ అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఇండియాను గర్వించేలా చేస్తారని ట్వీట్ చేశారు.

16 రోజుల పాటు జరిగే ఆసియా గేమ్స్ కోసం దాదాపు రూ. 2,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ గేమ్స్‌ను ఇండియాలో టెన్ స్పోర్ట్స్, టెన్ హెచ్‌డి ఛానళ్లు టెలికాస్ట్ చేస్తున్నాయి. ఈ ప్రారంభోత్సవంలో ఆసియా దేశాల సంస్కృతులు ఉట్టి పడేలా డ్యాన్సులతో అలరిస్తున్నారు. గతంలో 65 మెడల్స్ సాధించి ఆరో స్థానంలో నిలిచిన ఇండియన్ ప్లేయర్లు ఈ సారి టాప్-5 ప్లేస్ ను లక్ష్యంగా పెట్టుకున్నారు. డ్రీమ్ ఆఫ్ 4.5 బిలియన్ పీపుల్, వన్ ఏషియా థీమ్ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.

 ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే

ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే


17వ ఆసియా గేమ్స్‌ శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఆసియా గేమ్స్‌లో భారత్‌ నుంచి 515 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు.

 ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే

ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే


679 మంది సభ్యులతో కూడిన భారీ బృందాన్నే భారత ప్రభుత్వం ఇంచియాన్‌కు పంపింది. వీరిలో 516 మంది అథ్లెట్లు. ఇక 17వ ఆసియాడ్‌లో భారత్‌ 70-75 పతకాలు నెగ్గుకు రాగలదని సాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ జిజి థామస్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే

ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే

చైనా క్రీడాకారుల నుంచి ఎదురయ్యే పోటీ రీత్యా హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. 1986లో చివరిసారిగా భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచింది. ఆ తర్వాత టీం ఆసియా గేమ్స్‌లో ఎప్పుడూ పతకం లభించలేదు.
ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే

ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే


భారత్ భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, ఆశాకిరణం పీవీ సింధు, పురుషుల విభాగం స్టార్ షట్లర్ పారుపల్లి కాశ్యప్ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే, పతకాలు సాధించడం పెద్ద కష్టం కాబోదని భారత శిబిరం భావిస్తోంది.

ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే

ప్రారంభమైన ఆసియా గేమ్స్, ఆశలన్నీ ముగ్గురిపైనే


ఆసియా గేమ్స్ టెన్నిస్‌లో భారత్ అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతుంది. లియాండర్ పేస్, సానియా మిర్జా, రోహన్ బోపన్న ఆసియా గేమ్స్‌కు దూరమయ్యారు. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా ఆసియా గేమ్స్ నుండి వైదొలగింది.

భారత్ భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, ఆశాకిరణం పీవీ సింధు, పురుషుల విభాగం స్టార్ షట్లర్ పారుపల్లి కాశ్యప్ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే, పతకాలు సాధించడం పెద్ద కష్టం కాబోదని భారత శిబిరం భావిస్తోంది. అయితే, చైనా క్రీడాకారుల నుంచి ఎదురయ్యే పోటీ రీత్యా హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. 1986లో చివరిసారిగా భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచింది. ఆ తర్వాత టీం ఆసియా గేమ్స్‌లో ఎప్పుడూ పతకం లభించలేదు.

ఆసియా గేమ్స్ టెన్నిస్‌లో భారత్ అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతుంది. లియాండర్ పేస్, సానియా మిర్జా, రోహన్ బోపన్న ఆసియా గేమ్స్‌కు దూరమయ్యారు. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా ఆసియా గేమ్స్ నుండి వైదొలగింది. కుడి మోకాలి నొప్పి వేధిస్తుండటంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో గుత్తా జ్వాలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

English summary
17th edition of Asian Games, being held at the Incheon ​Asiad Main Stadium. K-Pop sensation Psy will headline the ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X