వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bloodiest Day: మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పులు: 18 మంది మృతి, 30 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

యాంగూన్: సైనిక పాలనను వ్యతిరేకిస్తూ, అంగ్ సాన్ సూకిని విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద నగరమైన యాంగూన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన ప్రజలపై ఆదివారం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది మృతి చెందారు. మరో 20 మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

కాగా, కాల్పులు జరిపిన పోలీసులకు సైనికాధికారులు మద్దతుగా నిలవడం గమనార్హం. పోలీసుల కాల్పుల్లో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రిలో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

శాంతియుతంగానే నిరసన చేస్తున్నప్పటికీ.. పోలీసులు, సైనికులు కాల్పులు జరపడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల ద్వారా ఎన్నికైన నేత అంగ్ సాన్ సూకీని బంధించి, సైనిక పాలనను విధించడంపై ప్రపంచ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 18 Killed In Myanmar On Bloodiest Day Of Protests Against Coup

పోలీసుల జరిపిన కాల్పులపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి ప్రదర్శన చేస్తున్నవారిపై కాల్పులు జరపడం అమానుషమని మండిపడింది.
ప్రపంచ దేశాలు కూడా తాజా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా, ఫిబ్రవరి 1న ప్రజల ద్వారా ఎన్నికైన అంగ్ సాన్ సూకీ, ఇతర అధికార పార్టీ నేతలను సైనికాధికారులు నిర్బంధించి, దేశంలో సైనిక పాలనను ప్రకటించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ ప్రజలు ఆ నాటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. సైనికాధికారులకు సంబంధించిన ఖాతాలను తొలగించడం గమనార్హం. మయన్మార్ దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

English summary
Myanmar police fired on protesters around the country on Sunday in the bloodiest day of weeks of demonstrations against a military coup and at least 18 people were killed, the U.N. human rights office said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X