వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను వణికించిన కరోనావైరస్..పాక్ భారత్‌కు అప్పగిస్తుందా..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు చేరువైంది. ఇక కరోనావైరస్ సోకి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 6.7 లక్షలుగా ఉంది. ఈ మహమ్మారికి పేద ధనిక అనే తారతమ్యం లేదు. అజాగ్రత్తగా ఉన్నామా అంతే సంగతులు పంజా విసిరేందుకు కాచుకుని కూర్చుంది. కంటికి కనిపించని ఈ మాయరోగం ఆయా దేశాధినేతలకే వణుకు పుట్టేలా తయారైంది. దేశ ఆర్థిక వ్యవస్థలను కూడా కూల్చింది. ఇక ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను కరోనా వణికించింది. దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.

దావూద్ ఇబ్రహీం స్థావరం ఎక్కడో తెలుసా? గుట్టువిప్పిన గ్యాంగ్‌స్టర్దావూద్ ఇబ్రహీం స్థావరం ఎక్కడో తెలుసా? గుట్టువిప్పిన గ్యాంగ్‌స్టర్

 డాన్‌కు కరోనా వైరస్ పాజిటివ్

డాన్‌కు కరోనా వైరస్ పాజిటివ్


ఒకప్పుడు ప్రపంచంలోని పలుదేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీంకు కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది . దావూద్‌తో పాటు అతని భార్యకు కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా తేలిందని సమాచారం. దీంతో దావూద్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిని మొత్తం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ప్రపంచానికి కనిపించకుండా ఎప్పుడూ అండర్ గ్రౌండ్‌లో ఉండే దావూద్ ఇబ్రహీంను కరోనావైరస్ బయటకు తీసుకొచ్చింది. కరాచీలోని ఓ మిలటరీ హాస్పిటల్‌లో దావూద్ ఇబ్రహీం అతని భార్య అడ్మిట్ అయ్యారు. అక్కడే చికిత్స పొందుతున్నారు.

భయపడుతున్న ఇతర క్రిమినల్స్

భయపడుతున్న ఇతర క్రిమినల్స్

దావూద్ ఇబ్రహీంకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో అతన్ని కలిసిన వారు, ఇతర క్రిమినల్స్ అంతా భయపడుతున్నారు. వారికి ఒకవేళ కరోనా వైరస్ సోకి ఉంటే పరిస్థితేంటనే ఆలోచనలో పడ్డట్టు సమాచారం. కరోనావైరస్ సోకితే తాము ఇంతకాలం పోలీసుల కళ్లు కప్పి తిరుగుతుంటే ఇప్పుడు ఆ పోలీసులే వారిని అరెస్టు చేస్తారేమోననే భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నాడనే విషయం ప్రపంచానికి తెలుసు కానీ పాక్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దావూద్‌ను భారత్‌కు అప్పగించేందుకు వెనకాడింది.

 1993 బాంబే పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్

1993 బాంబే పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్

1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారిగా దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం భారత్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం ఒక అండర్ వరల్డ్ డాన్‌ అని ప్రపంచానికి తెలుసు కానీ అతని కుటుంబం గురించి చాలా తక్కువమందికి తెలుసు. తన ప్రాణాలను టార్గెట్ చేసేవారు తన కుటుంబంను కూడా లక్ష్యంగా చేసుకుని పావులు కదిపే అవకాశం ఉందని భావించిన దావూద్ ఇబ్రహీం... తన కుటుంబాన్ని ఎప్పుడూ ప్రపంచం కంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దావూద్ భార్య పేరు మెహ్‌జాబిన్ అకా జుబీనా జరైన్. దావూద్ మరియు జుబీనాకు నలుగురు పిల్లలు. ఇందులో మహరూక్, మెహ్రీన్, మారియాలు కూతుళ్లు కాగా, మోయిన్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు.

పాక్ దావూద్‌ను భారత్‌కు అప్పగిస్తుందా..?

పాక్ దావూద్‌ను భారత్‌కు అప్పగిస్తుందా..?

ఇన్ని రోజులు దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని బుకాయించిన పాకిస్తాన్ ఇప్పుడు దావూద్ ఇబ్రహీం కరోనా సోకి కరాచీ మిలటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతను కోలుకున్న తర్వాతనైనా భారత్‌కు అప్పగిస్తారా లేదా అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. 12 మార్చి 1993న ముంబైలో 12 చోట్ల వరస బాంబులు పేలడంతో దాదాపు 317 మంది అమాయకులు మృతి చెందగా 1400 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి దావూద్ ఇబ్రహీం తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ కేసులో పలు అరెస్టులు కూడా జరిగాయి. ఈ ఘటనతో సంబంధమున్న యాకూబ్ మీమన్‌ను 2015 జూలై 30న ఉరితీయడం జరిగింది.

English summary
Underworld Don Dawood Ibrahim is tested positve for covid-19 along with his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X