వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుగులేని జీ జిన్‌పింగ్: చైనాను మరింత ముందుకు తీసుకెళ్తారా?

మరోసారి చైనా అధ్యక్షుడిగా జీ జిన్ పింగ్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి బీజింగ్‌లోని చారిత్రక తియాన్మెన్ స్క్వేర్ వద్ద గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్‌లో వారం పాటు చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 19

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఆటుపోట్లకు ఎదురొడ్డి అద్భుతాల వైపు అడుగులేసిన దేశం చైనా ఇకపై కూడా అదే దూకుడును కొనసాగిస్తూ దేశ దశ, దిశా నిర్దేశమే లక్ష్యంగా కీలక మథనానికి సన్నద్ధమైంది. భవిష్యత్ చైనా నిర్మాతల ఎన్నికకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఐదేళ్లకోసారి జరిగే అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) జాతీయ కాంగ్రెస్‌ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. బీజింగ్‌లోని చరిత్రాత్మక తియాన్మెన్‌ స్క్వేర్‌ వద్ద గల గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో ఈ నెల 18 నుంచి ఈ 19వ కాంగ్రెస్‌ జరుగనున్నది.
దేశ నలుమూలల నుంచి దాదాపు 2,287 మంది కమ్యూనిస్టు ప్రతినిధులు హాజరవుతారు. తదుపరి ఐదేళ్లకు దేశ ఉన్నత నాయకత్వాన్ని ఎన్నుకోవడం ఈ భేటీలో ప్రధాన అజెండా. అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా చైనా కమ్యూనిస్టు పార్టీ వైఖరి, విధాన నిర్ణయాలు, నిబంధనల్లోనూ కాలానుగుణంగా మార్పులు జరుగుతున్నాయి.

 జిన్ పింగ్ మినహా మిగతా పదవుల్లో భారీ మార్పులు

జిన్ పింగ్ మినహా మిగతా పదవుల్లో భారీ మార్పులు

దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మాత్రం మార్చే అవకాశాల్లేవు. ఆయనకు మరోమారు పట్టం కట్టడం దాదాపు ఖాయం. జిన్‌పింగ్‌ అధ్యక్షుడే కాక సీపీసీ ప్రధాన కార్యదర్శి, సైనిక బలగాల ప్రధాన అధిపతి కూడా. జిన్‌పింగ్‌ మినహా ఉన్నత నాయకత్వంలోని పలువురు ఈ సారి మారనున్నారు. కమ్యూనిస్టు పార్టీ జాతీయ మండలి‌, చైనా కేబినెట్‌లోని ఉన్నతస్థానాల్లో భారీ మార్పులు జరుగనున్నాయి. నాయకత్వ ఎంపికతోపాటు తదుపరి ఐదేళ్లలో అనుసరించాల్సి ప్రభుత్వ, పార్టీ విధాన ప్రాధాన్యతల్ని ఈ సదస్సు నిర్ణయిస్తుంది. ఆడంబరాలు, ఖరీదైన విందు భోజనాలకు చోటు లేకుండా సాదాసీదాగా కాంగ్రెస్‌ను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు.

 చైనా పీపుల్స్ రిపబ్లిక్ వ్యవస్థాపకుల్లో జీ తండ్రి ఒకరు

చైనా పీపుల్స్ రిపబ్లిక్ వ్యవస్థాపకుల్లో జీ తండ్రి ఒకరు

2012లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినపుడు చైనా పునరుత్థానానికి మార్గసూచీని ప్రకటించిన జిన్‌పింగ్ ఆ దిశగా ఈ ఐదేళ్లలో గణనీయ పురోగతి సాధించారు. పార్టీ, ప్రభుత్వంపై మరింత పట్టు బిగించారు. అసమ్మతిపై ఉక్కుపాదం మోపారు. సైన్యాన్ని మరింత నవీకరించారు. పిడివాదం, నియంత్రణల్ని అధిగమించి.. ప్రపంచ వేదికపై చైనాను మరింత శక్తిమంతమైన దేశంగా నిలిపారు. చైనా గత పాలకులతో పోల్చుకుంటే జిన్‌పింగ్‌ సాధించిన విజయాలు ఎక్కువ. ఆయనలో అంతటి ఆత్మ విశ్వాసం ఉండటానికి కుటుంబ చరిత్ర కూడా ఒక ప్రధాన కారణం. జిన్‌పింగ్‌ తండ్రి జీ ఝోంగ్జున్‌ చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు.

స్పష్టమైన నిర్ణయాలకు మారుపేరుగా జిన్‌పింగ్

స్పష్టమైన నిర్ణయాలకు మారుపేరుగా జిన్‌పింగ్

చైనాను సాంస్కృతిక విప్లవం కమ్ముకున్న రోజుల్లో- 15 ఏళ్ల జిన్‌పింగ్‌ పూర్తిగా గ్రామీణ జీవితం గడిపారు. ఆయన పుట్టి పెరిగిన లియాన్‌ఘ్జే ప్రాంతం కమ్యూనిస్టుల కంచుకోట. చైనా గత అధ్యక్షులు హూజింటావో, జియాంగ్‌జెమిన్‌లతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంత ప్రజల స్థితిగతులపై జిన్‌పింగ్‌కు బాల్యం నుంచే సంపూర్ణ అవగాహన ఉన్నందునే ఆయన అసందిగ్ధతకు తావులేని నిర్ణయాలు తీసుకుంటారు. సంస్కృతి, సంప్రదాయాలకూ పెద్దపీట వేశారు. దౌత్య నిబంధనల్ని ఆయన తిరగరాశారని చెప్పుకొంటారు. అందుకే ప్రపంచంలోని అత్యంత ఆదరణ కలిగిన నేతల్లో ఒకరిగా ఆయన నిలిచారు.

 దక్షిణ చైనా సముద్ర వివాదంలో బలంగా చైనా వాదన

దక్షిణ చైనా సముద్ర వివాదంలో బలంగా చైనా వాదన

విదేశీ వ్యవహారాల్లో జిన్‌పింగ్‌ అత్యంత కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర జలాల వివాదంలో చైనా వాదనను ఆయన మరింత బలంగా వినిపించారు. చైనా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణల్ని తోసిరాజని తమ సముద్ర జలాల దీవుల్లో ఆర్థిక జోన్లు, స్థావరాలను నిర్మించారు. ‘వన్‌ బెల్ట్‌, వన్‌ రోడ్‌' పేరిట అద్భుతమైన మౌలిక వసతుల్ని నిర్మించి థాయ్‌లాండ్‌, మియన్మార్‌, కంబోడియా లాంటి దేశాలు తమకు అనుకూలంగా మారేలా చేసుకున్నారు.

రాజకీయ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇలా

రాజకీయ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇలా

చైనాలో పాలనకు కళంకంగా మారిన అవినీతిపై జిన్‌పింగ్‌ ఉక్కుపాదం మోపారు. అవినీతికి పాల్పడిన పార్టీ, ప్రభుత్వంలోని పలువురు సీనియర్లను జైలుకు పంపారు. రాజకీయ కుట్రలకు పాల్పడుతున్న పార్టీ ప్రత్యర్థులు పలువురిని అవినీతి కేసులపై అరెస్టులు చేయించారు. అంతర్గత నిఘాతో అవినీతిపరుల ఆటలకు చెక్‌పెట్టారు. పార్టీ కామ్రేడ్లను అదుపులో ఉంచడం, ఇంటర్నెట్‌ను నియంత్రించడం అనే రెండు ప్రధాన అంశాలపై ఆయన దృష్టి సారించారు. నవ కల్పనలు, వాణిజ్య పరంగా చైనా సైబర్‌ సూపర్‌పవర్‌గా మారాలని కాంక్షిస్తూ రాజకీయ క్రమశిక్షణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని షరతు విధించారు. ‘సామాజిక క్రెడిట్‌' అనే వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల ప్రవర్తనను అంచనావేయడం ప్రారంభించారు. నేరగాళ్ల ప్రయాణాలపై నియంత్రణలు విధించారు. సైనిక బలగాల నవీకరణను మరింత వేగిరం చేశారు. రెండు అధునాతన యుద్ధనౌకలు ప్రారంభించారు. తదుపరి ఐదేళ్లు జిన్‌పింగ్‌కు అత్యంత కీలకం. ఆయన విజయం సాధిస్తే మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఆయనకు తిరుగు ఉండదు.

 విధాన నిర్ణయాలన్నీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీవే

విధాన నిర్ణయాలన్నీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీవే

చైనా రాజకీయ వ్యవస్థ చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ), ప్రభుత్వం, సైన్యం అనే మూడు ప్రధాన విభాగాలుగా ఉంటుంది. జాతీయ రాజకీయ ఎజెండాను నిర్ణయించే సీపీసీకి ప్రభుత్వం, సైన్యం అనుయాయిలుగా పనిచేస్తాయి. సీపీసీలో కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో, పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ అనే మూడు విభాగాలు ఉంటాయి. అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ప్రధాని లీ కెకియాంగ్‌ సహా చైనా నాయకత్వంలోని అత్యంత ముఖ్యులు పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ (పీఎస్‌సీ)లో సభ్యులు. కేంద్ర కమిటీలో 376 మంది, పొలిట్‌బ్యూరోలో 25 మంది, పీఎస్‌సీలో ఏడుగురు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రాల ప్రభుత్వాలు, సైన్యం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశ్రమలు, పార్టీ సంఘాల్లోని వారు కేంద్ర కమిటీ సభ్యులు. సీపీసీలోని సీనియర్లు పొలిట్‌బ్యూరో సభ్యులు. పీఎస్‌సీ అనధికార పాలనా మండలిలాంటిది. ప్రధాన నిర్ణయాలన్నీ ఇదే తీసుకుంటుంది. ప్రస్తుతం జరగబోయే పార్టీ సదస్సులో ఈ మూడు విభాగాల్లో పలు మార్పులు జరగనున్నాయి. పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు రిటైర్‌ కానున్నారు. పొలిట్‌బ్యూరోలోని 25 మంది సభ్యుల్లో 11 మంది వైదొలగనున్నారు.

English summary
China's 88-million-strong Communist Party of China (CPC) will kick off its 19th National Congress in Beijing on Wednesday. This key event occurs once every five years to set the Party's national policy goals and elect its top leadership. The congress will review the Party's work since 2012 and chart a course to guide the nation's development over the coming years under a new leadership elected by 2,300 nationwide delegates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X