వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయులు క్షేమం: పారిస్‌లో తెగబడ్డారిలా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఫ్రాన్స్‌లో జరిగిన దాడుల బాధితుల్లో భారతీయులు ఎవరూ లేరని ప్యారిస్‌లోని భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు పరిస్థితిని నివేదించింది. దాడుల ఘటన తెలియగానే సహాయవాణి ఏర్పాటు చేసింది.

ప్యారిస్ ఘటనలో భారతీయులు అందరూ క్షేమమని లాస్ ఏంజిల్స్ పర్యటనలో ఉన్న భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, దాడుల నేపథ్యంలో ప్యారిస్ ప్రాంతంలో జరగాల్సిన అన్ని రకాల క్రీడా పోటీలు రద్దయ్యాయి.

ఇలా దాడి చేశారు..

శుక్రవారం రాత్రి 9.20 నిమిషాలకు స్టేడ్ డె ఫ్రాన్స్ స్టేడియం వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఫ్రాన్స్, జర్మనీ మధ్య స్నేహపూర్వక ఫుట్‌‍బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానం వెలుపల ఉన్న మూడు ఫుడ్ కోర్టుల వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

ఇక్కడ మొదటి పేలుడు గం.9.20కి, రెండో పేలుడు గం.9.30కి, మూడో పేలుడు గం.9.53 నిమిషాలకు సంభవించాయి. ఈ ఘటన సమయంలో స్టేడియంలో ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హొలాండే ఉన్నారు.

గ.9.25 నిమిషాలకు లీ కారిలాన్ బార్ సమీపంలో ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. రోడ్డు దాటి సమీపంలోనే ఉన్న లిటిల్ కంబోడియా రెస్టారెంటు వద్ద కూడా కాల్పులు జరిపాడు. ఈ రెండు చోట్ల పన్నండు మంది మృతి చెందారు. ఓ కారు పైనా కాల్పులు జరిపాడు.

ఆ తర్వాత రూ అలీ బెర్ట్ ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న లా కాసా నోస్ట్రా పిజ్జేరియా టెర్రెస్ పైన ఉగ్రవాది కాల్పులు జరిపాడు. బాటాక్లాన్ హాలు వెలుపల ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. రాత్రి గం.9.50కి లా బెల్లే ఎక్వీ పె బార్ వద్ద కేఫ్ టెర్రాస్ పైన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

రాత్రి పది గంటల సమయంలో బాటాక్లాన్ సంగీత వేదిక వద్ద ముగ్గురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. మరో ఉగ్రవాదిని పోలీసులు కాల్చి చంపేశారు. బాటాక్లాన్ సంగీత వేదిక వద్ద పదిహేను వందల మంది అభిమానులు ప్రదర్శన వీక్షిస్తున్నారు.

 సొంత దేశం వాళ్లే

సొంత దేశం వాళ్లే

ఐసిస్ దాడులతో ప్రపంచం ఉలిక్కిపడింది. సొంత దేశ పౌరులతోనే దాడులు చేయించే దిశగా ఈ ఉగ్రవాద సంస్థ వ్యూహాలు ఉండడంతో ఐరోపా దేశాలు గజగజలాడుతున్నాయి. ప్యారిస్‌ వీధుల్లో నరమేధం సృష్టించి దాదాపు 129 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల్లో కొందరు ఫ్రాన్స్‌ పౌరులే అని భద్రతా బలగాలు గుర్తించాయి.

సొంత దేశం వాళ్లే

సొంత దేశం వాళ్లే

ఇటీవల కాలంలో పలు ఐరోపాదేశాల్లోని పౌరులు ఐసిస్ భావజాలానికి ఆకర్షితులై సిరియా, ఇరాక్‌ వెళ్లి తిరుగుబాట్లలో పాల్గొంటున్నారు. అటువంటి వారిలో కొంత మంది స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. తమ నగరాల్లోనూ ఇటువంటి దాడులు జరగవచ్చని మిగిలిన ఐరోపా దేశాలు భయపడుతున్నాయి.

సొంత దేశం వాళ్లే

సొంత దేశం వాళ్లే

ఇరాక్‌, సిరియా తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పట్టు సాధించిన ఈ సంపన్న ఉగ్రవాద సంస్థ ఇతర దేశాల్లోనూ దాడులు చేయగల సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు శుక్రవారం నాటి దాడులతో రుజువవడంతో పాశ్చాత్య దేశాలు అప్రమత్తమయ్యాయి.

 సొంత దేశం వాళ్లే

సొంత దేశం వాళ్లే

సిరియా సంక్షోభంపై వియన్నాలో సమావేశమయిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, వివిధ ఐరోపా దేశాల ప్రతినిధులు ఐసిస్ పైన ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. తాజా దాడులు యుద్ధవాతావరణాన్ని సృష్టించాయి.

పారిస్‌ ఘటనలో ఓ ఉగ్రవాదిని గుర్తించిన పోలీసులు

పారిస్‌ ఘటనలో ఓ ఉగ్రవాదిని గుర్తించిన పోలీసులు

ప్యారిస్‌లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

పారిస్‌ ఘటనలో ఓ ఉగ్రవాదిని గుర్తించిన పోలీసులు

పారిస్‌ ఘటనలో ఓ ఉగ్రవాదిని గుర్తించిన పోలీసులు

మృతుల్లో ఓ ఉగ్రవాదిని పోలీసులు గుర్తించారు. బటక్లాన్‌ థియేటర్‌ వద్ద దాడికి పాల్పడిన ఉగ్రవాది పేరు ఒమర్‌ ఇస్మాయిల్‌ అని తెలిపారు. నగరంలోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇతను పారిస్‌కు చెందినవాడిగా తెలుస్తోంది.

English summary
Paris attacks: Suicide bomber identified; ISIS claims responsibility for 129 dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X