వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:అలర్ట్..అలర్ట్... పిల్లులకు వైరస్, పెంపుడు జంతువులకు సోకిన రక్కసి, భయపడొద్దు....

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ క్రమంగా పశు, పక్ష్యాదులకు పాకుతోంది. ఇప్పటికే అమెరికాలోని బ్రాంక్స్ జూ లో ఓ పులికి వైరస్ సోకగా.. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో రెండు పిల్లులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అమెరికాలో ఇది తొలి పెంపుడు జంతువులకు సోకిన పాజిటివ్ కేసు అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇతర పెంపుడు జంతువులకు కూడా వైరస్ పాకుతోందా అనే అనుమానం కలుగుతోంది.

యజమాని నుంచి..?

యజమాని నుంచి..?

పిల్లులకు వైరస్ ఇంటి యాజమాని లేదంటే ఇరుగుపొరుగు వారి నుంచి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అవి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాయని ఫెడరల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగ అధికారులు తెలిపారు. పిల్లి, పులికి మనుషుల నుంచి వైరస్ సోకిందని.. వాటి నుంచి ప్రజలకు వైరస్ సోకలేదని.. భయపడొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. ఇందుకు సంబంధించి ఎలాటి ఆధారాలు లేవు అని డాక్టర్ బెహ్రావేష్ తెలిపారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం పెంపుడు జంతువులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటికి దూరంగా ఉండాలని.. ఇంట్లోకి పిల్లులు, శునకాలను రానీయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. పెంపుడు జంతువులకు లక్షణాలు లేకుంటే పరీక్షలు అవసరం లేదు అని మరో నిపుణుడు జేన్ రూనీ తెలిపారు.

రసాయనాల కొరత..

రసాయనాల కొరత..

పశువైద్య ప్రయోగశాలలో పెంపుడు జంతువులకు పరీక్షలు చేస్తారు. సాధారణంగా ప్రజలకు ఉపయోగించే రసాయనాల కన్నా భిన్నమైన రసాయనాలు ఉపయోగిస్తారు. అయితే వైరస్ ప్రభావంతో ప్రస్తుతం జంతువుల రసాయనాలు తక్కువ మొత్తంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి నివసిస్తోన్న ఇంట్లో పెంపుడు జంతువు ఉండొచ్చని.. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ సూచించింది. ఆపత్కాలంలో ప్రజలు పెంపుడు జంతువులను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడింది.

 పశువులు, కోళ్లకు నో...

పశువులు, కోళ్లకు నో...

సాధారణంగా కరోనా వైరస్ లక్షణాలైన జ్వరం, దగ్గు రెండు నుంచి మూడువారాల్లో తగ్గిపోతున్నాయని.. వృద్దులు, చిన్నపిల్లలకు న్యూమోనియాగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని పేర్కొన్నారు. వైరస్ గురించి జంతువులు, ప్రజల మధ్య సంబంధాలపై నిశీతంగా పరిశీలిస్తున్నామని నిపుణలు పేర్కొన్నారు. దీనిపై ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పారు. చైనాలోని వుహాన్ మార్కెట్‌లో జంతువు మార్కెట్‌లో వైరస్.. గబ్బిలం నుంచి సంక్రమించింది. కానీ ఇళ్లు, పంట పొలాలలో జంతువులకు వైరస్ సంక్రమణపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. పశువులు, కోళ్లకు వైరస్ సోకినట్టు తమ పరిశోధనలో తేలలేదని శాస్త్రవేత్త రూనీ పేర్కొన్నారు.

Recommended Video

COVID-19 : Cabinet Approves Ordinance To Protect Health Workers

English summary
Two pet cats in New York state have tested positive for the novel coronavirus, marking the first confirmed cases in companion animals in the United States, federal officials said Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X