వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యారిస్ ఆపరేషన్ పూర్తి: ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: గత మూడు రోజుల పాటు ప్యారిస్‌ను గుప్పిట పట్టి భయోత్పాతాన్ని సృష్టించిన ఇద్దరు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులను ఫ్రాన్స్ పోలీసులు తమ ఆపరేషన్‌లో కాల్చి చంపేశారు.. శుక్రవారం మరో ఐదుగురిని బందీలుగా తీసుకుని అలజడి రేకెత్తించిన మిలిటెంట్లను పట్టుకునేందుకు ఏకంగా 2వేలమంది పోలీసులు రంగంలోకి దిగి అన్ని వైపులనుంచి వారిని కట్టడి చేశారు.

తీవ్ర స్థాయిలో ఉత్కంఠ, అలజడి నేపథ్యంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. బందీలకు ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా విడిపించారు. అంతకుముందు దేశ రాజధాని ప్యారిస్ తూర్పు ప్రాంతంలోని కోషెర్ సూపర్ మార్కెట్‌లో శుక్రవారం ఐదుగురిని నిర్బంధించి ఉగ్రవాదులు సరికొత్త డ్రామాకు తెర లేపారు. గురువారం ఒక మహిళా పోలీసును కాల్చిచంపినట్లు అనుమానిస్తున్న ఆగంతకుడే తాజాగా కోషెర్ మార్కెట్‌లో దాడికి దిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

2 Charlie Hebdo suspects killed in police assault; several hostages freed: Sources

ఈ దాడిలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయని, మరో ఐదుగురిని ఆ ఆగంతకుడు నిర్బంధించాడని అధికారులు చెబుతున్నారు. ఇది ఇలావుంటే, చార్లీ హెబ్డో వద్ద కొద్ది రోజుల క్రితం 12 మంది అమాయకులను ఊచకోత కోసినట్లుగా అనుమానిస్తున్న కౌచీ సోదరులను డమ్మార్టిన్ ఎన్ గొయెల్ పట్టణంలో భద్రతా బలగాలు చుట్టుముట్టి హెలికాప్టర్ల సహాయంతో ముప్పేట దాడికి సిద్ధమయ్యాయి.
ఈ ప్రాంతం ప్యారిస్‌లోని ప్రధాన విమానాశ్రయానికి (గల్లె ఎయిర్‌పోర్టుకు) కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

ఉగ్రవాద దాడులకు భయపడి స్థానిక ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రాకపోవడంతో ప్రస్తుతం డమ్మార్టిన్ ఎన్ గొయెల్‌లో ఏ వీధి చూసినా సాయుధ కమెండోలు, పోలీసులే దర్శనమిస్తున్నారు. కౌచీ సోదరుల కోసం వారు విస్తృత స్థాయిలో వేట ప్రారంభించారు. అంతకుముందు హైస్పీడ్ కారులో డమ్మార్టిన్ ఎన్ గొయెల్‌లోని ప్రింటింగ్ కార్యాలయం వైపునకు దూసుకొస్తున్న కౌచీ సోదరులను పోలీసులు తీవ్రస్థాయిలో వెంబడించడంతో పాటు వారిపై కాల్పులు కూడా జరిపారు.

అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదని ప్రాసిక్యూటర్లు ఎఎఫ్‌పి వార్తా సంస్థకు తెలిపారు. దుండగులు నల్లటి రంగులో ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించి ఉన్నారని, వారి వద్ద ‘కలష్నికోవ్' (ఎకె) తరహా ఆయుధాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, ఉగ్రదాడుల నేపథ్యంలో ప్యారిస్ తోపాటు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రధాన నగరాలను పోలీసులు తమ నిఘా నీడలోకి తీసుకున్నారు.

English summary
Two brothers suspected of slaughtering 12 people at the Charlie Hebdo magazine were killed today when elite police stormed the building they were holed up in and freed a hostage unhurt, sources close to the investigation said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X