వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్ స్వయంకృషి సంపన్నుల్లో ఇద్దరు భారత సంతతి మహిళలు, పిన్న వయస్కురాలు టీవీ నటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఇద్దరు టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లకు స్వయంకృషితో ఎదిగిన ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చోటు దక్కింది. వారు జయశ్రీ ఉల్లాల్, నీరజ సేథి. జయశ్రీ ఉల్లాల్ 18, నీరజ 21వ స్థానంలో నిలిచారు.

లండన్‌లో జన్మించి భారత్‌లో పెరిగిన జయశ్రీ ఉల్లాల్‌ (57) కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ అరిస్టా నెట్‌వర్క్స్‌ ప్రెసిడెంట్‌, సిఇఒగా పని చేస్తున్నారు. స్టాక్‌మార్కెట్‌లో లిస్టింగ్‌ అయిన ఈ కంపెనీ 2017 సంవత్సరంలో 160 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఈ కంపెనీలో జయశ్రీకి 5 శాతం వాటాలున్నాయి. వాటాల్లో కొన్నింటిని తన ఇద్దరు పిల్లలు, మేనల్లుడు, మేనకోడలికి కూడా కేటాయించారు.

2 Indian origin tech ladies join Kylie Jenner on Americas richest self made women list

నీరజ సేథి (63) ఐటి కన్సల్టింగ్, ఔట్‌సోర్సింగ్‌ కంపెనీ సింటెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. భర్త భరత్‌ దేశాయ్‌ ఈ కంపెనీ వ్యవస్థాపకులు. 1980లో 2 వేల కోట్ల డాలర్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ కంపెనీ 2017 నాటికి 92.4 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి ఎదిగింది. 23 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. 80 శాతం మంది భారత్‌లో పని చేస్తున్నారు.

అమెరికా గృహ నిర్మాణ సంస్థ ఏబీసీ సప్లై చైర్మన్ డయానే హెన్రిక్స్ రూ.33,547 కోట్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. మూడేళ్లలో రూ.6,164 కోట్ల విలువైన కాస్మోటిక్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అమెరికా టీవీ స్టార్ కైలీ జెన్నర్ 20వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలు కైలీ జెన్నరే.

English summary
Indian-origin technology executives Jayshree Ullal and Neerja Sethi have made it to the Forbes' list of America's 60 richest self-made women, with 21-year-old reality-TV star and entrepreneur Kylie Jenner the youngest to be featured in the power list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X