వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌లో బస్సు-ట్రక్కు ఢీ .. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఖాట్మండ్ : అందాలను చూసి ఆనందిద్దామని వెళ్లిన ఆ పర్యాటకులను మృత్యువు కబళించింది. ట్రక్కురూపంలో వచ్చిన మృత్యువు బస్సును ఢీకొంది. దీంతో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. 21 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఆగిన బస్సును ఢీ ..
సోమవారం అర్ధరాత్రి నేపాల్‌లోని చంద్రాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పౌరాయి అటవీప్రాంతంలో ఆగింది. అందులో దాదాపు 60 మంది భారత పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. అయితే వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీ కొంది. దీంతో బస్సు 20 మీటర్ల మేర అడవీలోకి వెళ్లిందని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. ట్రక్కు ధాటికి బస్సులో తీవ్రగాయాలైన ఇద్దరు చనిప్యారు. ఒడిశాకు చెందిన బిజయ్ కుమార్ జేనా, చరణ్ బిషాల్‌గా గుర్తించినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ తరలించినట్టు పేర్కొన్నారు.

2 Indian pilgrims die, 21 injured as truck rams bus in Nepal

చికిత్స ..
సర్బేశ్వర్ జేనా, శేషదేవ్ జేనా, కరుణా అవాస్థి అనే పర్యాటకుల పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. వారిని మెగురైన చికిత్స కోసం బిర్జండ్ ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. మిగతా క్షతగాత్రులను చంద్రణిగహపూర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బస్సును ఢీ కొన్న ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని వివరించారు. అతని కోసం దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. బస్సు ప్రమాదం గురించి నేపాల్‌లోని భారత దౌత్యవేత్తకు సమాచారం అందించినట్టు స్థానిక అధికారులు తెలియజేశారు.

English summary
A passenger bus carrying 60 Indian pilgrims has been hit by a truck in Nepal’s Rautahat district, killing two persons on the spot and wounding 21 others, a media report said Tuesday. The accident occurred late Monday night when the Kathmandu-bound bus stopped at Paurai forest area in Chandrapur Municipality-1 for the passengers to freshen up, said Nabin Karki, Deputy Superintendent of Police at Rautahat District Police Office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X