• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిక్కుబిక్కుమంటూ: ఇద్దరి పరిస్థితి విషమం, హర్రీకేన్ బాధితులకు తానా, ఆటా ఆపన్నహస్తం

|

హోస్టన్: అమెరికాను అతలాకుతలం చేస్తున్న హర్రీకేన్ తుఫాన్ కారణంగా భారీ వరదలు టెక్సాస్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. టెక్సాస్ సమీపంలోని బైరన్ లో ఓ సరస్సులో ఇద్దరు ఇండియన్ విద్యార్థులు మునిగిపోవడం తీవ్ర కలకలం రేపింది.

స్విమ్మింగ్ కోసమని వెళ్లిన విద్యార్థులు సరస్సులో మునిగిపోవడంతో.. రెస్క్యూ టీమ్ సిబ్బంది వారిని రక్షించారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉందని వారు చదువుతున్న ఏ&ఎం యూనివర్సిటీ యాజమాన్యం వెల్లడించింది. శనివారం రోజు ఈ ప్రమాద ఘటన జరిగినట్లు తెలిపింది.

పెట్రోలింగ్ పోలీసుల సహాయంతో:

పెట్రోలింగ్ పోలీసుల సహాయంతో:

తాము పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో.. సరస్సు దగ్గరి నుంచి వెళ్తుండగా ఓ వ్యక్తి తమకీ సమాచారం అందించాడని బైరన్ పోలీసులు తెలిపారు. చేయి పైకెత్తి.. సరస్సులో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయినట్లుగా సంకేతాలిచ్చాడని చెప్పారు.

అతని సమాచారంతో పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అప్పటికే అతను ఓ విద్యార్థిని రక్షించగా.. పోలీస్ అధికారి మరో విద్యార్థిని రక్షించాడు. వీరిద్దరు అటు ఇటుగా 20సంవత్సరాల లోపు వారేనని గుర్తించారు. సరస్సు నుంచి వారిని ఒడ్డుకు చేర్చిన తర్వాత వైద్యం సహాయం అందే లోపు 'కార్డియో పల్మనరీ రెసిస్కుటేషన్' విధానం ద్వారా పోలీసులే వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం స్థానిక సెయింట్ జోసెఫ్ ఆసుపత్రికి తరలించారు.

షాలిని, భాటియా

షాలిని, భాటియా

ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని ఇండియాకు చెందిన షాలిని, భాటియాలుగా గుర్తించారు. హోస్టన్ లోని భారత రాయబార కార్యాలయం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. భాటియా ఇంకా కోలుకోవాల్సి ఉందని, షాలిని మాత్రం కాస్త కోలుకుందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

కుమారుడు భాటియా పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే ఆయన తండ్రి డాక్టర్ సుమన్ భాటియా ఇండియా నుంచి అమెరికా చేరుకున్నారు. డల్లాస్ విమానశ్రయంలో భారత రాయబార అధికారులు ఆయనను కలుసుకున్నారు. షాలిని సోదరుడు కూడా రేపు అమెరికా వస్తున్నట్లు వారు వెల్లడించారు.

వీధులన్ని నదుల్లా:

వీధులన్ని నదుల్లా:

అమెరికాను అల్లకల్లోలం చేస్తున్న హర్రీకేన్ విపత్తుతో దాదాపు 1.3కోట్ల మంది ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరదలు ముంచెత్తుతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వరదల ధాటికి ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. కాలనీలు, వీధులు సైతం నదుల్లా పొంగిపొర్లుతున్నాయి.

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత బుధవారం ఒక్కరోజు కురిసిన వర్షానికే 50అడుగుల లోతు వరద నీళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. హర్రీకేన్ ఉధృతి మరింత ఎక్కువయ్యే సూచనలు ఉండటంతో ఎమర్జెన్సీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

వరదల కారణంగా 200మంది భారతీయ విద్యార్థులు తలో చోట చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. అయితే వీరిందరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ వాళ్లు భారతీయ విద్యార్థులకు ఆహారం సరఫరా చేస్తున్నారు. హోస్టన్ భారత రాయబార కార్యాలయం అధికారి అనుమమ్ రే విద్యార్థులతో టచ్ లో ఉంటూ వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

తానా సహాయం:

తానా సహాయం:

వరదల్లో చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు తానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) బృందం తమవంతు సహాయం అందిస్తోంది. ఇందుకోసం కొన్ని ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసి.. సహాయం కోరేవారు సంప్రదించాల్సిందిగా తెలిపారు.

సంప్రదించాల్సిన నంబర్స్:

832-520-8332(పద్మశ్రీ ముత్యాల)

713-876-7919 (రత్న ప్రసాద్ గుమ్మడి),

409-504-4666 (డాక్టర్ ప్రసాద్ నల్లూరి),

404-290-2076 (డాక్టర్ వాసు కొడాలి)

314-606-0562 (శ్రీనివాస్ గొట్టిపాటి)

ఈమెయిల్: president@tana.org.

ఆటా సహాయం:

ఆటా సహాయం:

ఆటా(అమెరికా తెలుగు అసోసియేషన్స్) ప్రతినిధులు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. విద్యార్థులకు, ఇతర పేదలకు ఆటా నుంచి ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. భారీ సహాయం అవసరమవుతుండటంతో ఆటా బృందమంతా కలిసికట్టుగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలియజేశారు.

వరదా బాధితుల కోసం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. వరదల్లో చిక్కుకున్నవారు, లేక ఇతర సహాయం కోరదలిచినవారు 1-844-282-7382 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాల్సిందిగా చెప్పారు. ఉదయం 8గం. నుంచి రాత్రి 8గం. వరకు ఈ నంబర్ అందుబాటులో ఉందని తెలిపారు.

ఈమెయిల్: atahelp@ataworld.org / shivam.r@gmail.com

సహాయం చేసేవారు ఇక్కడ సంప్రదించండి: https://americanteluguassociation.org/donor.php

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two Indian students are in a critical condition after they nearly drowned in Lake Bryan in the US state of Texas, which is battling "catastrophic" flooding and torrential rains after Hurricane Harvey wreaked havoc, claiming at least five lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more