వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు భారతీయులకు 'బ్రిటన్‌‌రాణి యంగ్‌లీడర్స్ అవార్డు'

|
Google Oneindia TeluguNews

లండన్‌: సామాన్య ప్రజల బతుకులను మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న ఇద్దరు భారతీయులకు బ్రిటన్‌ రాణి యువ నాయకుల అవార్డు-2016 లభించింది. ఈ అవార్డు గెలుచుకున్న 60 మందిలో కార్తీక్‌ సాహ్నీ(21), నేహా స్వెయిన్‌(28)లు ఉన్నారు.

వచ్చే ఏడాది జూన్‌లో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో బ్రిటన్‌ రాణి చేతుల మీదుగా వీరికి అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలని కార్తీక్‌ తపించారు. పుట్టుకతోనే అంధుడైన కార్తీక్‌ పదో గ్రేడ్‌ వరకు విజ్ఞాన శాస్త్రాన్ని చదివారు.

కాగా, ఆ తర్వాత అంధులకు ఈ శాస్త్రాన్ని చదవడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. అయితే కార్తీక్‌ ధైర్యం చేసి విజ్ఞానశాస్త్రం గ్రేడ్‌ 11లో చేరారు. దేశంలో ఈ గ్రేడ్‌లో చేరిన మొదటి అంధ విద్యార్థిగా కార్తీక్‌ గుర్తింపు పొందాడు.

ఇంజినీరింగ్‌లో చేరాక తొలుత ఇబ్బంది పడ్డానని, ఈ సమస్యను పరిష్కరించేందుకు అంధుల కోసం భారత్‌లో 'స్టెమ్‌యాక్సెస్‌' కార్యగోష్ఠిని ప్రారంభించినట్లు కార్తీక్‌ పేర్కొన్నారు. కాగా, రూబరూ ఎన్జీవో సహ వ్యవస్థాపకురాలు నేహాస్వెయిన్‌. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా భారత యువతకునాయకత్వ నైపుణ్యాలను నేర్పుతున్నారు.

భారత్‌లోని పాఠశాలల్లో ఉచితంగా కార్యగోష్ఠులను నిర్వహిస్తోంది ఈ సంస్థ. ఈ అవార్డు ద్వారా ఎలాంటి నగదు బహుమానం లభించదు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వీరికి ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ శిక్షణకు వీలు కల్పిస్తుంది. కాగా, ప్రజలకు ప్రముఖంగా సేవలందించిన 53దేశాలకు చెందిన 60మంది వ్యక్తులను ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది.

English summary
Two Indians have won the Queen's Young Leaders award in the UK for their exceptional work in transforming the lives of others and making a lasting difference in their communities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X