వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు భారతీయ సిబ్బంది విడుదల.. కనిపించిన గాయాలు, పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు..

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌లో కనిపించకుండా పోయిన భారత రాయబార కార్యాలయ ఇద్దరు ఉద్యోగులను ఆ దేశ పోలీసులు వదిలేశారు. కానీ వారిపై గాయాలు కనిపించడంతో దాడి చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం ఉదయం ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. విషయం భారత విదేశాంగ శాఖకు తెలియడంతో.. భారత ప్రభుత్వం ఒత్తిడి పాకిస్తాన్ తలొగ్గింది.

రోడ్డు ప్రమాదం అని..

రోడ్డు ప్రమాదం అని..

అయితే వారిద్దరూ ఉద్యోగులు పాదచారులను కారుతో ఢీ కొట్టారని, అందుకే పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో వారి ఆచూకీ గురించి ఆందోళన నెలకొంది. చివరికి ఇస్లామాబాద్ సెక్రటేరియట్ పోలీసు స్టేషన్ వద్ద వారిని అప్పగించి వెళ్లారు. భారత రాయబార కార్యాలయం అక్కడినుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ వారికి వైద్య పరీక్షలు చేసి.. వారి నుంచి స్టేట్‌మెంట్ తీసుకోనున్నారు. ఇద్దరు ఉద్యోగులు ఆచూకీ కనిపించలేదు అని భారత సిబ్బంది చెప్పినా 7 గంటల తర్వాత హిట్ అండ్ రన్ కేసును తెరపైకి తీసుకొచ్చారు.

రంగంలోకి దౌత్య వేత్తలు

రంగంలోకి దౌత్య వేత్తలు

భారత హై కమిషన్ సిబ్బంది కనిపించడం లేదు అనే సమచారంతో సోమవారం భారత దౌత్యవేత్తలు, రాయబార కార్యాలయ అధికారులు నిత్యం మానిటర్ చేస్తూనే వచ్చారు. కానీ తర్వాత రోడ్డు ప్రమాద కేసులో సీఐఎస్ఎఫ్, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మీడియాలో వార్తాలొచ్చాయి. అయితే వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ప్రజలు పట్టుకున్నారని అక్కడ మీడియా రిపోర్ట్ చేసింది.

Recommended Video

AP Assembly Sessions : YSRCP Govt Not Allowing మీడియా
నో ఎంక్వైరీ, నో హరాస్ మెంట్

నో ఎంక్వైరీ, నో హరాస్ మెంట్

హిట్ అండ్ రన్ కేసులో సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారని.. కానీ వారిని విచారించలేదు అని, వేధించలేదని పాకిస్తిన్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడినుంచి అధికారులను వెళ్లిపోవాలని కోరినట్టు తెలిపారు.

English summary
Two Indian high commission staffers who went missing on Monday morning have been handed over at Islamabad’s secretariat police station, barely 2 km from the Indian mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X