చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండేళ్ల చిన్నారి అరుదైన జాతీయ రికార్డ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: రెండేళ్ల బాలిక అరుదైన జాతీయ రికార్డ్ సృష్టించింది. అలియా షాహుల్ హమీద్ వయస్సు కేవలం రెండేళ్లు. కానీ, ఈ చిన్నారి అరుదైన ఘనత సాధించింది. తద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

2 year old girl creates national record; meet the Wonder Kid Aaliyah

అలియా తమిళనాడుకు చెందిన చిన్నారి. ఈ చిన్నారి మెమొరీ రికార్డ్ గేమ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఈ చిన్నారి జామెట్రికల్, నాన్ జామెట్రికల్‌కు చెందిన ఎక్కువ ఆకారాలను కేవలం ఒకే ఒక నిమిషంలో గుర్తించింది. తద్వారా అరుదైన ఫీట్ సాధించింది.

మెమొరీ రికార్డ్ గేమ్‌లో పాల్గొంటున్న చిన్నారులు... ఒక్క నిమిషంలో కనీసం 25 ఆకారాలను గుర్తించవలసి ఉంటుంది. కానీ, అలియా మాత్రం ఏకంగా 35 జామెట్రికల్, నాన్ జామెట్రికల్ ఆకారాలను ఒక్క నిమిషంలో గుర్తించింది.

2 year old girl creates national record; meet the Wonder Kid Aaliyah

తమిళనాడుకు చెందిన... అలియా తన తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం అబుదబీలో ఉంటోంది. కాగా, ఈ మెమోరీ రికార్డ్ గేమ్ సెప్టెంబర్ 28వ తేదీన హర్యానాలోని ఫరీదాబాదులో గల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయంలో జరిగింది.

2 year old girl creates national record; meet the Wonder Kid Aaliyah

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2004లో ప్రారంభమైంది. దీనిని డాక్టర్ బిశ్వరూప్ రాయ్ చౌదరి ప్రారంభించారు. బిశ్వరూప్ స్వయంగా గిన్నిస్ రికార్డ్ సాధించిన వ్యక్తి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్... జాతీయ స్థాయిలో రికార్డులను సేకరిస్తుంటుంది.

English summary
She is just two-year-old, but Aaliyah Shahul Hameed has achieved a rare feat by creating a new record and entering her name into the India Book of Records.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X