వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ తెగ గిరాకీ, 20 దేశాలు, 100 కోట్ల డోసుల ఆర్డర్.. ఏడాది చివరికీ 20 కోట్లు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయి. అయితే తొలుత వచ్చిన రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కోసం తెగ డిమాండ్ ఏర్పడింది. వాస్తవానికి వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉండగా.. ఇటీవల కొందరు వ్యాక్సిన్ తీసుకోగా.. జ్వరం వచ్చింది. అయినప్పటికీ కొన్ని దేశాలు... కోట్ల డోసుల కోసం ఆర్డర్లు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాక్సిన్ గురించి అమెరికా నెగిటివ్‌గా ప్రచారం చేస్తోన్న చాలా దేశాలు మాత్రం విశ్వసించడం విశేషం.

20 దేశాలు ఆర్డర్..

20 దేశాలు ఆర్డర్..

వ్యాక్సిన్ కోసం 20 దేశాల నుంచి ఆర్డర్ వచ్చిందని రష్యా ప్రకటించింది. 100 కోట్ల డోసులు కావాలని కోరాయని పేర్కొన్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పది దేశాలు ఒప్పందం చేసుకున్నాయని తెలిపింది. అయితే ఫస్ట్, సెకండ్ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని నివేదికలు రావడంతో.. పలుదేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసం భారత్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కూడా ఒప్పందం కుదుర్చుకుంది.

100 కోట్ల డోసులు..

100 కోట్ల డోసులు..


ఇప్పటివరకు 100 కోట్ల డోసుల కోసం వినతి వచ్చాయని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి 20 కోట్ల వ్యాక్సిన్ డోసులను సిద్దం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నది. 3 కోట్ల డోసులను రష్యాలో తయారు చేస్తున్నామని.. మిగతా వాటిని దక్షిణ కొరియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, టర్కీ, క్యూబా, భారత్ భాగస్వామ్యంతో చేసే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది.

Recommended Video

Mystery Seeds : Mysterious Seeds Arrived In Australia,Is It A Brushing స్కామ్ ?
40 వేల మందిపై ప్రయోగం..

40 వేల మందిపై ప్రయోగం..

వ్యాక్సిన్ ప్రయోగం మూడోదశలో 40 వేల మందిపై చేస్తున్నామని గమలేయ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు తెలిపారు. సౌదీ అరేబియా, యూఏఈ, బ్రెజిల్, పిలిప్పీన్స్ దేశాల్లో ప్రయోగాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ప్రయోగ ఫలితాలను లాన్సెట్ ప్రచురించింది. వైరస్ వచ్చి కోలుకున్న వారి కంటే.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించింది. మరోవైపు ఆస్ట్రాజెనా, మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగ దశలో ఉన్నాయి. 30 వేల మందిపై తుది దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

English summary
sputnik-v vaccine: 20 countries ordered russian coronavirus vaccine sputnik-v. 100 crore doses they want.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X