వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేట్రేగిన గన్ కల్చర్: వాల్ మార్ట్ స్టోర్ లో రక్తపాతం: 20 మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

టెక్సాస్: వారాంతపురోజు. నిత్యావసర వస్తవులును కొనడానికి కొందరు, వారాంతపు రోజులను సరదాగా గడపడానికి మరికొందరు వాల్ మార్ట్ స్టోర్ కు చేరుకున్నారు. సుమారు 3000 మంది వాల్ మార్ట్ స్టోర్ లో షాపింగ్ చేయడానికి వచ్చారు. అదే సమయంలో ఓ 21 ఏళ్ల యువకుడొకడు తుపాకీతో స్టోర్ లోనికి ప్రవేశించాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చి పడేశాడా కిరాతకుడు. ఈ ఘటనలో 20 మంది మరణించారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే.. ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఉదంతం అది.

దద్దరిల్లిన వాల్ మార్ట్ స్టోర్

దద్దరిల్లిన వాల్ మార్ట్ స్టోర్

అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ ఎల్ పాసో సమీపంలోని సియాలో విస్టాలో గల మార్ట్ సూపర్ మార్కెట్ లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12:45 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హంతకుడిని ప్యాట్రిక్ క్రూసియస్ గా గుర్తించారు. డల్లాస్ శివార్లలోని అల్లెన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. రైఫిల్ ను చేత్తో పట్టుకుని షాపింగ్ స్టోర్ లోకి ప్రవేశించిన ప్యాట్రిక్.. మెక్సికన్లను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 20 మంది సంఘటనాస్థలంలోనే నేలకొరిగారు. 30 మందికి పైగా గాయపడ్డారు. అరుపులు, కేకలు, బుల్లెట్ల శబ్దాలతో వాల్ మార్ట్ స్టోర్ దద్దరిల్లిపోయింది.

మెక్సికన్ల సంఖ్య అధికం..

మెక్సికన్ల సంఖ్య అధికం..


కాల్పులను విరమించిన అనంతరం అనంతరం ప్యాట్రిక్ పోలీసులకు లొంగిపోయాడు. హేట్ క్రైమ్ ఈ ఘటనకు ప్రధాన కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మెక్సికోతో సరిహద్దులను పంచుకుంటోన్న ఎల్ పాసో నగరంలో లాటిన్ అమెరికాకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న వారిలో లాటిన్ అమెరికన్లదే మెజారిటీ. అందుకే- ఈ నగరంలో పోలీసుల భద్రత ఎప్పుడూ అధికంగా ఉంటుంది. దీన్ని సున్నిత, సమస్యాత్మక ప్రాంతంగా చెబుతుంటారు. ఈ కాల్పుల ఘటనలో మరణించిన వారిలో ఎక్కువమంది మెక్సికన్లే ఉన్నారు. మెక్సికన్లను అసహ్యించుకునే స్థానిక అమెరికన్ ఈ కాల్పులకు తెగబడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మెక్సికన్ల పట్ల అసహ్యమే కాల్పులకు కారణం..

మెక్సికన్ల పట్ల అసహ్యమే కాల్పులకు కారణం..

కాల్పులు జరిపిన సమయంలో వాల్ మార్ట్ స్టోర్ లో సుమారు 3000 మంది స్థానికులు, 150 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. కాల్పుల సమచారం అందుకున్న వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వారెవరూ లోనికి వెళ్లకుండా హంతకుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకన్నాడు. షాపింగ్ స్టోర్ లోనికి ప్రవేశించడానికి గల అన్ని మార్గాలనూ మూసివేశాడు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు ముగిసిన వెంటనే స్టోర్ ప్రధాన ద్వారం గుండా బయటికి వచ్చిన ప్యాట్రిక్.. పోలీసులకు లొంగిపోయాడు. హేట్ క్రైమ్ దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మెక్సికన్ల పట్ల ఉన్న అసహ్యాన్ని హంతకుడు.. ఇలా ప్రదర్శించాడని, వారిని లక్ష్యంగా చేసుకునే ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

 దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ట్రంప్..

దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ట్రంప్..

అతణ్ని అదుపులోకి తీసుకున్న వెంటనే స్థానిక ఎల్ పాసో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. నిందితుడిని విచారిస్తున్నారు. తన నేరాన్ని నిందితుడు అంగీకరించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కాల్పుల ఉదంతంలో సుమారు 30 మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంల చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

English summary
El Paso Walmart Shooting, Texas in America, mass shooting as a possible hate crime, El Paso Police Chief, white male suspect from Allen, a suburb of Dallas, surrendered to police outside the store, A gunman armed with an assault rifle, opened fire on shoppers at a packed Walmart store in El Paso, Texas, killing 20 people in the latest mass shooting in the United States
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X