వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని హింస: 20 హిందువుల గృహలు ధ్వంసం.. హై టెన్షన్

|
Google Oneindia TeluguNews

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ సందర్భంగా ప్రారంభమైన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. తాజాగా 20 హిందువుల నివాసాలకు అల్లరిమూకలు నిప్పంటించాయి. 66 ఇళ్లను ధ్వసం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. సోషల్ మీడియా పోస్టులో దుర్గామాత కాళ్ల వద్ద ఖురాన్ ఉండడం ఈ అల్లర్లకు కారణమని ప్రచారం జరుగుతోంది.

రంగ్ పూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ పోస్టును ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసినట్టు భావిస్తున్నారు. ఆ యువకుడు ఉంటున్న గ్రామంపై 100 మంది దండెత్తి, ఇళ్లను ధ్వంసం చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 66 ఇళ్లను ధ్వంసం చేయగా.. అందులో 20 హిందువుల ఇళ్లు ఉన్నాయి. వారే లక్ష్యంగా దాడి చేశారు. మరోవైపు ఫేస్ బుక్ పోస్ట్ చేసిన వ్యక్తి ఉంటోన్న మత్య్సకారుల కాలనీకి పోలీసులు భద్రత కల్పించారు. బలగాలను అక్కడికి పంపించారు. హింసాత్మక ఘటనకు సంబంధించి పదుల సంఖ్యలో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. చాంద్ పూర్, నొఖాలీ వద్ద భక్తులు చనిపోయారని క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ తెలియజేసింది. ఆ సంఖ్య కాస్త పెరుగుతూ వస్తోంది.

20 Hindu Homes Set On Fire In Bangladesh Days After Puja Violence

మరోవైపు కామిల్లా పట్టణం నానుర్ దిగాయ్ సరస్సు వద్ద ఉన్న దుర్గాదేవి మండపం వద్ద ఖురాన్‌ను అపవిత్రం చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దావానాలంలా వ్యాపించింది. దీంతో మతపరమైన హింసకు కారణమయ్యింది. ఆ తర్వాత చాంద్‌పూర్ హజిగనీ, ఛాటొగ్రామ్ భాక్షాలి, పెకువాలో గల కాక్స్ బజార్ వద్ద కూడా హింస చెలరేగింది. ఇతర మండపాలకు కూడా హింస వ్యాపించింది.

ఖురాన్‌కు అవమానం జరిగిందనే సమాచారంతోనే దాడులు జరిగాయని.. ఈ ఏడాది జరిగిన హింసాత్మక ఘటనలను మరచిపోలేం అని హిందు కౌన్సిల్ తెలియజేసింది. ఢాకాలో గల టిప్పు సుల్తాన్ రోడ్, చిట్టాగ్యాంగ్‌‌లో గల కొట్వాలీ వద్ద కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Bigg Boss Telugu 5 : సిరి ని ఘోరంగా అవమానించిన షణ్ముఖ్..తెగ ఏడ్చేసిన సిరి..!

English summary
Sixty six houses were vandalised and at least 20 homes of Hindus set on fire in Bangladesh over an alleged blasphemous social media post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X