
పెను విషాదం: నైట్‌క్లబ్‌లో 20 మంది యువత అనుమానాస్పద మృతి, దర్యాప్తు ముమ్మరం
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ఆఫ్రికాలోని తూర్పు లండన్‌లోని టౌన్షిప్లో తాత్కాలిక నైట్‌క్లబ్‌లో మరణించిన యువకుల సంఖ్య 20కి పెరిగిందని సీనియర్ భద్రతా అధికారి ఆదివారం తెలిపారు.
'మరణాల సంఖ్య 20కి పెరిగింది, ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. కానీ ఇప్పటికీ ఇద్దరు చాలా క్లిష్టంగా ఉన్నారు' అని ప్రాంతీయ ప్రభుత్వ భద్రతా విభాగం అధిపతి వెజివే టికానా-గ్క్సోథివే స్థానిక టీవీలో తెలిపారు.

అంతకుముందు, నైట్‌క్లబ్‌లో 17 మంది మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. "ఈస్ట్ లండన్‌లో ఉన్న సీనరీ పార్క్‌లోని స్థానిక చావడిలో 17 మంది (యువకులు) మరణించినట్లు మాకు నివేదిక వచ్చింది' అని ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి బ్రిగేడియర్ థెంబింకోసి కినానా మీడియాకి తెలిపారు.
"సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులపై మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నాము," అన్నారాయన. బాధితులు 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలిపారు.
ఈస్టర్న్ కేప్ ప్రావిన్షియల్ కమ్యూనిటీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారి ఉనతి బింకోస్, సంఘటన స్థలం నుంచి మాట్లాడుతూ.. తొక్కిసలాట మరణానికి కారణమనేదాన్ని తోసిపుచ్చారు. "చనిపోయిన వారికి కనిపించే బహిరంగ గాయాలు కనిపించనందున ఇది తొక్కిసలాట అని నమ్మడం కష్టం" అని బింకోస్ టెలిఫోన్ ద్వారా ఏఎఫ్పీకి చెప్పారు.
ప్రాంతీయ స్థానిక వార్తాపత్రిక, డిస్పాచ్‌లైవ్, "శరీరాలు టేబుల్లు, కుర్చీలు, నేలపై పడి ఉన్నాయి. గాయమైనట్లు స్పష్టమైన సంకేతాలు లేవు" అని నివేదించింది.
జోహన్నెస్‌బర్గ్‌కు దక్షిణంగా దాదాపు 1,000 కిమీ (620 మైళ్లు) దూరంలో హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న నగరంలోని క్లబ్ వెలుపల గుమిగూడిన తల్లిదండ్రులు మరియు చూపరుల గుంపును శాంతింపజేయడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు స్థానిక టెలివిజన్ చూపించింది.
జోహన్నెస్‌బర్గ్‌కు దక్షిణంగా దాదాపు 1,000 కిమీ (620 మైళ్లు) దూరంలో హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న నగరంలోని క్లబ్ వెలుపల గుమిగూడిన తల్లిదండ్రులు, ప్రజల గుంపును శాంతింపజేయడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు స్థానిక టెలివిజన్ పేర్కొంది.
పరీక్షలు ముగిసిన తర్వాత పార్టీ చేసుకునేందుకు యువకులంతా ఈ క్లబ్‌కు చేరుకున్నట్లు సమాచారం. అయితే, మరణాలకు మాత్రం కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు, అధికారులు వెల్లడించారు.