వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాణి కోసం 2 రోజులు కారువెంట పడ్డ తేనెటీగలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: రాణి తేనెటీగను వదిలి ఉండలేక దాదాపు 20వేల తేనెటీగలు ఓ కారును రెండు రోజుల పాటు వెంబడించాయి. ఇందుకు సంబంధించిన వార్త ఇంటర్నెట్లో హల్‌చల్ సృష్టిస్తోంది. ఇది అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఇది అద్భుతమైన సంఘటన అని చెప్పవచ్చు.

తమ సమూబంలోని రాణి తేనెటీగ ఓ కారులో ఇరుక్కుంది. దానిని కాపాడేందుకు మిగతా తేనెటీగలు 24 గంటల పాటు కారును వెంబడించాయి. ఇది బ్రిటన్‌లో జరిగింది. కార్లోజ్ హవార్త్ అనే 65 ఏళ్ల వృద్ధురాలు ఓ నేచర్ రిజర్వ్ పార్కుకు వెళ్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరింది.

20000 bees chase car for two days because they didn't want to leave their queen

మార్గమధ్యంలో హావెర్ ఫోర్డ్ వెస్ట్ టౌన్ సెంటర్ వద్దకు రాగానే.. దాదాపు 20 వేల తేనెటీగలు కారుకు అతుక్కున్నాయి. కారు బయలుదేరినా అవి వదల్లేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె అధికారులకు సమాచారం ఇచ్చారు. ముగ్గురు తేనెటీగల సంరక్షకులు, జాతీయ పార్క్ రేంజర్ వచ్చి అసలు విషయాన్ని గుర్తించారు.

ఆమె తీసుకువెళుతున్న ఓ అట్టపెట్టెలో రాణి తేనెటీగ ఉండవచ్చునని, దానిని కాపాడేందుకు అవి వెంబడిస్తూ వచ్చాయని తెలిసి, ఆ పెట్టెను తెరిచారు. రాణి తేనెటీగ ఎగిరిపోయింది. అలాగే, రాణి తేనెటీగ వెంట వచ్చిన ఆ ఇరవై వేల మగ తేనెటీగలు కూడా మాయమ్యాయి.

English summary
A car was pursued by a loyal 20,000-strong swarm of bees for two days after their queen got trapped in the boot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X