వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: '2012లో మలాలాపై దాడి అంతా ఓ నాటకం'

పాకిస్తాన్ నోబెల్ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ పైన దాడి అంతా ఓ నాటకం అని పాక్ పార్లమెంటు సభ్యురాలు ముస్సారత్ అహ్మద్ జేబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్తాన్ నోబెల్ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ పైన దాడి అంతా ఓ నాటకం అని పాక్ పార్లమెంటు సభ్యురాలు ముస్సారత్ అహ్మద్ జేబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

ఇస్లామాబాద్‌లో ఉమ్మత్ అనే పత్రికకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. మలాలాపై దాడి ఘటన ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్టు ప్రకారం జరిగిందని సంచలన ప్రకటన చేశారు.

2012లో మలాలాపై దాడి స్క్రిప్ట్

2012లో మలాలాపై దాడి స్క్రిప్ట్

2012లో మలాలాపై జరిగిన దాడి బీబీసీ చానెల్‌ కోసం సిద్ధం చేసిన ప్రణాళిక ఆధారంగా జరిగిందన్నారు. ఆ దాడిలో మలాలా తలకు బుల్లెట్‌ తగిలింది, కానీ స్వాత్‌లో తీసిన సీటీ స్కాన్‌లో ఆ బుల్లెట్ ఆమె తలలో ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదన్నారు.

బుల్లెట్ ఎలా..

బుల్లెట్ ఎలా..

మరి పెషావర్‌లోని కంబైన్డ్ మిలటరీ ఆసుపత్రి రిపోర్టుల్లో మాత్రం ఆమె తలలోకి బుల్లెట్ వచ్చింది...ఎలా? అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై ఆమెకు చికిత్స చేసిన వైద్యులు కూడా మిలటరీ ఆసుపత్రి రిపోర్టులతో విభేదించారన్నారు.

అసలు చదవడం, రాయడం రాదు

అసలు చదవడం, రాయడం రాదు

ఆ డాక్టర్లకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కూడా ఇచ్చిందని ఆరోపించారు. బీబీసీలో చూపించినట్లుగా మలాలాకు అసలు చదవడం, రాయడం రాదని ఆమె చెప్పారు.

ఆరోపించింది ఇమ్రాన్ పార్టీ నేత

ఆరోపించింది ఇమ్రాన్ పార్టీ నేత

మలాలా ఇంట్లో ఓ అమెరికన్ మూడు నెలలు ఉన్నారని, ఆమె నిర్వహించాల్సిన పాత్రపై శిక్షణ ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆరోపణలు చేసిన ముస్సారత్.. ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పార్టీలో ఉన్నారు. ఆమె ఇలా హఠాత్తుగా మలాలాపై ఎందుకు ఆరోపణలు చేశారో తెలియనప్పటికీ, ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

English summary
A Pakistani woman parliamentarian has claimed that the 2012 Taliban attack on Nobel Peace Prize winner Malala Yousafzai was "scripted".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X