వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 నోబెల్‌ వైద్య పురస్కారం- బ్రిటన్‌, అమెరికా శాస్త్రవేత్తలకు- హెపటైటిల్‌ సీ వైరస్‌ కనుగొన్నందుకు.

|
Google Oneindia TeluguNews

2020 సంవత్సరానికి నోబెల్‌ పురస్కారాల ప్రకటన మొదలైంది. ఈ ఏడాది నోబెల్‌ వైద్య పురస్కారానికి ముగ్గరు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఇందులో బ్రిటన్‌కు చెందిన మైఖేల్‌ హాటన్‌, అమెరికాకు చెందిన హార్వే జే ఆల్టర్‌, ఛార్లెస్‌ ఎం రైస్‌ ఉన్నారు. వీరు హెపటైటిస్‌ సీ వైరస్‌ను కనుగొన్నందుకు వీరిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు.

ఇందులో హార్టర్డ్‌ జే ఆల్టర్‌ రక్తమార్పిడి అనుబంధ హెపటైటిస్‌ వైరస్‌ తరచూ వచ్చే హెపటైటిస్‌కు కారణమని నిరూపించారు. మరో శాస్త్రవేత్త మైకేల్‌ హాటన్‌ ఇప్పటివరకూ ప్రయోగించని ఓ కొత్త పద్ధతిలో హెపటైటిల్‌ సీ అనే కొత్త వైరస్‌ జన్యువును వేరు చేయడం ఎలాగో చూపించారు. అలాగే హెపటైటిస్ సి వైరస్ మాత్రమే హెపటైటిస్‌కు కారణమవుతుందని చూపించే తుది ఆధారాలను చార్లెస్ ఎం. రైస్ బయటపెట్టారు. లివర్ క్సాన్సర్‌కు కారణమవుతున్న ఈ వైరస్‌ను కనుగొనడం ద్వారా వీరు కోట్లాది మంది ప్రాణాలు కాపాడారని నోబెల్‌ కమిటీ వీరిని ప్రశంసించింది. 1960ల్లో రక్తదానం ద్వారా రక్తం తీసుకోవాలంటే జనం క్రానిక్‌ హెపటైటిస్‌ సోకుతుందని భయపడేవారు. దీన్నో మిస్టీరియస్‌ డిసీజ్‌గా కూడా చెప్పుకునేవారు. ఆ తర్వాత దీనిపై జరిగిన పరిశోదనల్లో హెపటైటిల్‌ సీ వైరస్‌ దీనికి కారణంగా శాస్త్రవేత్తలు తేల్చారు.

2020 Nobel: Three scientists share Nobel Prize in Physiology or Medicine

ఇవాళ వైద్యశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ప్రకటన రాగా.. భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని రేపు మధ్యాహ్నం ప్రకటించనున్నారు. అలాగే ఎల్లుండి రసాయన శాస్త్రంలో నోబెల్‌ను, గురువారం సాహిత్యంలో నోబెల్‌ను, ఆర్ధికశాస్త్రంలో నోబెల్‌ను వచ్చే సోమవారం ప్రకటించనున్నారు.

English summary
The 2020 Nobel Prize for Physiology or Medicine has been awarded jointly to Harvey J. Alter, Michael Houghton and Charles M. Rice “for the discovery of Hepatitis C virus.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X