వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 యూఎస్ ఎలక్షన్స్ కాస్ట్లీ గురూ.. 14 బిలియన్ డాలర్ల విరాళాల సేకరణ.. కరోనా వైరస్..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానమే వేరు.. ప్రచారం, పోటీ, డిబేట్.. ముందస్తు ఓట్లతో భిన్నంగా సాగుతోంది. అయితే కరోనా వైరస్, మాంద్యం సమయంలో జరుగుతోన్న 2020 అధ్యక్ష ఎన్నికలకు ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే ఈ ఎలక్షన్స్ కోసం ఎక్కువగా వ్యయం అవుతోంది. గత ఎన్నికల కంటే రెట్టింపు ఖర్చవుతోందని ఆ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది.

రాజకీయ విరాళాలు, సుప్రీంకోర్టుతో ఘర్షణ; వైట్ హౌస్, సెనేట్ కోసం 11 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అనుకొన్నారు. కానీ అది 14 బిలియన్ డాలర్లకు చేరిందని సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పొలిటిక్స్ వివరించారు. ఇదివరకు ఏ ఎన్నిక కోసం కూడా ఇంత ఖర్చవలేదని చెప్పారు. అయితే డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ 1 బిలియన్ డాలర్లను విరాళాల ద్వారా సేకరించి రికార్డు సృష్టించారు. ఈ నెల 14వ తేదీ వరకు 938 మిలియన్ డాలర్లను బిడెన్ సేకరించారు. కానీ ట్రంప్ మాత్రం 596 మిలియన్ డాలర్లను మాత్రమే సేకరించగలిగారు.

2020 US Presidential election to be most expensive in history, expected to cost $14 billion

కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఉన్నా.. జనం మాత్రం విరాళాలు ఇస్తున్నారు. చిన్న విరాళాల నుంచి బిలియనీర్ల వరకు 8 చెక్కులను అందజేస్తున్నారు. అయితే ఇందులో మహిళలు మాత్రం ఎక్కువ విరాళాలు ఇచ్చారు. పదేళ్ల క్రితం బిలియన్ డాలర్ డొనేషన్లు చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అదీ ఒకరే బిలియన్ డాలర్లు విరాళాల ద్వారా సేకరించారు.

English summary
2020 Presidential election is turning out to be the most expensive election in history and twice as expensive as the previous presidential election cycle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X