వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

22కు చేరిన మృతుల సంఖ్య: 700 మందికి గాయాలు.. టర్కీ, గ్రీకు దీవుల్లో భీతావాహ పరిస్థితి..

|
Google Oneindia TeluguNews

టర్కీ, గ్రీక్ ఐలాండ్‌లో సంభవించిన భూకంపంతో మరణాలు పెరుగుతున్నాయి. భూ ప్రకంప ప్రభావంతో చనిపోయిన వారి సంఖ్య 22కి చేరింది. భవనాలు నేలమట్టం అవడంతో వాటి కింద చాలా మంది క్షతగాత్రులు ఉన్నారు. 700 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్‌ సముద్రంలో భూమి కంపించిందని అధికారులు గుర్తించారు.

Recommended Video

#TurkeyEarthquake : టర్కీ, గ్రీస్ దేశాలు కకావికలం.. భూకంపం తో పాటు సునామీ కూడా.. భారీ ప్రాణ నష్టం!

టర్కీ, గ్రీస్‌లలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, నలుగురు మృతి, 120 మందికి గాయాలు(వీడియో)టర్కీ, గ్రీస్‌లలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, నలుగురు మృతి, 120 మందికి గాయాలు(వీడియో)

వరదలు..

వరదలు..

భూకంపంతో భవనాలు కూలిపోగా.. వరదలు వస్తున్నాయని స్థానిక అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఇజ్మిర్ వద్ద పరిస్థితి భయానకంగా ఉంది అని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. 7.0 తీవ్రతతో భూకంపం రావడంతో చిన్నగా సునామీ కూడా వచ్చింది. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సముద్రపు నీరు భారీగా వచ్చింది. దీవి మొత్తం నీటితో నిండిపోయింది. భూ ప్రకంపనాల ప్రభావంతో చేపలు తగ్గిపోయాయి. అయితే 17 మంది చనిపోయారు.. 700 మంది గాయపడడారని టర్కీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపిందని రాయిటర్స్ నివేదించింది. మరికొన్ని వార్తా సంస్థలు 19 మంది చనిపోయారని రిపోర్ట్ చేస్తున్నాయి.

 కూలిన 17 భవనాలు..

కూలిన 17 భవనాలు..

ఇజ్మిర్‌లో కూలిపోయిన 17 భవనాల కింద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమీపంలో షెల్టర్ ఏర్పాటు చేసి 2 వేల మంది వరకు ఆశ్రయం కల్పిస్తున్నారు. భూకంపంలో చనిపోయిన వారికి గ్రీకు ప్రధాని సంతాపం తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే నోటి నుంచి మాట రావడం లేదని ట్వీట్ చేశారు.

ఇజ్మీర్‌పై దెబ్బ

ఇజ్మీర్‌పై దెబ్బ

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సమోస్‌లోని గ్రీకు పట్టణం కార్లోవాసికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. టర్కీ ఏజియన్ రిసార్ట్ నగరం ఇజ్మీర్ వద్ద భూకంపం వల్ల భారీ నష్టం సంభవించింది. టర్కీలో భూకంపం బాధితులకు అత్యవసర వైద్యం అందించేలా చూస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రో్ అదనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు.

17 వేల మంది మృతి

17 వేల మంది మృతి

సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ జస్టిస్ బ్రైన్ చెప్పారు. టర్కీలో గతంలో భూకంపాలు ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ జనవరిలో ఇలాజిగ్‌ ప్రావిన్సు‌లో సంభవించిన భూకంపంలో 30మందికి పైగా మృతి చెందగా.. 1600 మంది గాయపడ్డారు. 1999లో ఇస్తాంబుల్‌ సమీపంలోని ఇజ్మిట్‌ నగరంలో వచ్చిన భూకంపంలో ఏకంగా 17 వేలమంది చనిపోయిన సంగతి తెలిసిందే.

English summary
earthquake struck the Aegean Sea between the Turkish coast and the Greek island of Samos on Friday, killing at least 22 people and injuring over 700 amid collapsed buildings and flooding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X