వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో 231 డైనోసార్ గుడ్లు స్వాధీనం

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా అధికారులు ఒక ఇంటిలో సోదాలు చేసి రాక్షస బల్లి డైనోసార్ గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో ఏకంగా 231 డైనోసార్ గుడ్లు బయటపడటంతో అధికారులు షాక్ కు గురైనారు. ఇంటిలో సోదాలు చెయ్యగా గుడ్లతో పాటు డైనోసార్ అస్తిపంజరం బయటపడింది.

చైనాలోని గువాంగ్ డోంగ్ ప్రావెన్స్ ప్రాంతంలోని ఒక ఇంటిలో డైనోసార్ గుడ్లు ఉన్నాయని అధికారులకు సమాచారం అందింది. జులై 29వ తేదిన అధికారులు ఇంటిలో డైనోసార్ గుడ్లు స్వాదీనం చేసుకున్నారని ఈనెల 6వ తేది గురువారం చైనా మీడియా వెల్లడించింది.

గువాంగ్ డోంగ్ రాజధాని హెయువాన్ నగరంలో గత జూన్ నెల నుండి ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు (పునాది) జరుగుతున్నాయి. ఆ సందర్బంలో శిథిలావస్థలో ఉన్న 231 డైనోసార్ గుడ్లతో పాటు అస్తిపంజరం బయటపడింది.

231 Dinosaur Eggs Seized in China

అయితే ఇంటి యజమాని వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండ ఇంటిలో దాచిపెట్టుకున్నాడని అధికారులు అంటున్నారు. చైనాలో డైనోసార్ గుడ్లు బయటపడటం ఇది కొత్త ఏమికాదు. గతంలో అనేక గుడ్లు స్వాధీనం చేసుకున్నారు.

డైనోసార్ ల స్వస్థలం అని హెయివాన్ నగరానికి పేరు ఉంది. ఈ నగరం గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. చైనా లోని మ్యూజియంలో 10 వేలకు పైగా డైనోసార్ గుండ్లు ఉన్నాయి. అయితే తవ్వకాలలో పురాతన వస్తువులు ఏవైనా చిక్కితే అది ప్రభుత్వానిదే అని చైనాలో ఒక చట్టం ఉంది.

తవ్వకాలలో లభించిన పురాతన వస్తువులు ప్రభుత్వానికి అప్పగించకుంటే వారి మీద అక్కడి పోలీసు అధికారులు కేసులు నమోదు చేస్తారు. స్వాధీనం చేసుకున్న డైనోసార్ గుడ్లు శిథిలావస్థ స్థితిలో ఉన్నాయని చైనా మీడియా తెలిపింది.

English summary
As many as 231 fossilised dinosaur eggs and a dinosaur skeleton have been seized from a house in China's southern Guangdong Province.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X