వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత విద్యార్థులకు షాక్: వెళ్లిపోవాలని ఆదేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: స్పాట్‌ అడ్మిషన్‌ పేరిట నమ్మించి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. అర్హతలు, నిబంధనల గురించి పూర్తి వివరాలు చెప్పకుండా అడ్మిషన్లు కల్పించి డబ్బులు తీసుకున్నారు. తీరా తొలి సెమిస్టర్‌ పూర్తి కావడానికి సమయంలో దగ్గరపడుతున్న సమయంలో అర్హతలు లేవంటూ విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు.

డబ్బులు, సమయం వృధా కావడంతో దిక్కు తోచని పరిస్థితిలో భారత విద్యార్థులు పడ్డారు. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అర్హతలు లేవనే కారణంతో వెస్టర్న్‌ కెంటకీ యూనివర్సిటీ కొందరు విద్యార్థులను బహిష్కరించింది. వీరిలో కొందరికి ఇక్కడే తగిన కోర్సులో చేరేందుకు లేదా ఏదైనా వర్సిటీలో అడ్మిషన్‌కు సాయపడతామని సూచించింది.

25 Indians Told To Leave US University After Being Given Admission

స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని 25 మంది భారత విద్యార్థులకు సూచించింది. ఈ ఏడాది జనవరిలో కెంటకీ వర్సిటీ అంతర్జాతీయ ఏజెన్సీలద్వారా భారతలో అడ్మిషన్ల కార్యక్రమం నిర్వహించింది. ఈ ఏడాది జనవరిలో 60 మంది కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లో చేరేందుకు పేర్లు నమో దు చేసుకున్నారు.

మొదటి సెమిస్టర్‌పూర్తి కావస్తుండగా వారి లో 40 మంది అర్హులు కారని తేలినట్లు వర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ చైర్మన్‌ జేమ్స్‌ గ్యారీ తెలిపారు. సామర్థ్యం సాధించకుండా వీరు బయటకు వెళితే తమ వర్సిటీ పేరు పోతుందని, అందుకే బహిష్కరించామని చెప్పారు. కాగా, భారత ప్రధాని అమెరికాలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకుంది.

విద్యార్థులను వెళ్లిపోవాలని యూనివర్శిటీ చెప్పడం పట్ల వెస్టర్న్ కెంటకీ విశ్వవిద్యాలయం భారత విద్యార్థుల సంఘం చైర్మన్ ఆదిత్య శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారింత దూరం వచ్చి డబ్బులు పెట్టారని, వారి పట్ల ఇలా జరగడం సరి కాదని ఆయన అన్నారు.

English summary
At least 25 Indian students in their first semester of computer sciences programme at Western Kentucky University have been asked to return to India or find placement in other schools, because they did not meet the admission standards of the varsity, The New York Times said on Tuesday as Prime Minister Narendra Modi was on a US visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X