వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుద్వారాలో కాల్పుల మోత, చిన్నారులు సహా 25 మంది మృతి, 150 మంది వరకు...

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్‌లో గల గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. బుధవారం ప్రార్థనలు చేస్తుండగా దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 25 మంది సిక్కులు చనిపోయారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు దాడి చేయడంతో.. భద్రతా సిబ్బంది కూడా ధీటుగానే స్పందించారు. కానీ పదుల సంఖ్యలో సిక్కులు మాత్రం నెలకొరిగారు. ఘటనా జరిగిన సమయంలో గురుద్వారాలో 150 మంది సిక్కులు ప్రార్థనలు చేస్తున్నారు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు కొందరినీ కాపాడటంతో మృతుల సంఖ్య తగ్గింది. లేదంటే గురుద్వారా శవాలదిబ్బగా కనిపించేది.

కాబూల్‌గల షోర్ బజార్‌ వద్ద గల గురుద్వారా లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. కాల్పులు 25 మంది చనిపోగా, 8 మంది గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారికి ఆర్యన్ పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్‌లో సిక్కుల మైనారిటీ వర్గమని తెలిసిందే. ఇక్కడ ముస్లిం, సిక్కుల మధ్య ఆధిపత్య పోరు కూడా కొనసాగుతోంది. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోన్న హక్కానీ గ్రూపు ప్రోద్బలంతో ఉగ్రవాద దాడి జిరగిందని ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఆస్రఫ్ గని ఆరోపించారు. కానీ దాడి జరిపింది తామేనని ఐఎస్ పేర్కొన్నదని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. గురుద్వారాపై దాడిని తాలిబాన్లు ఖండించారు. వాస్తవానికి అమెరికా-తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. కానీ ఆప్ఘనిస్తాన్‌లో మాత్రం హింస చెలరేగుతూనే ఉంది.

25 Sikhs feared dead in Gurudwara terror attack in Kabul

Recommended Video

Evening News Roundup 21/03/2019

కాబూల్‌లో గురుద్వారాపై ఉగ్రవాదుల దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. గురుద్వారాపై దాడి దేనికి సంకేతమని భారత పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్ లాంటి దేశంలో మైనార్టీ వర్గాలపై దాడి.. మత స్వేచ్చ హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
Twenty-five people were killed after gunmen opened fired at a gurdwara in Afghanistan's capital Kabul, the local media has reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X