వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇతనో.. డిజిటల్ బిచ్చగాడు: ఆన్‌లైన్ ద్వారా యువకుడి లక్షల సంపాదన

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: డబ్బులు సంపాదించేందుకు ఉద్యోగం, వ్యాపారం వంటివి చేయడం అందరూ చేసేదే. కానీ కొందరు వినూత్నంగా ఆలోచించి డబ్బులు సంపాదించేవారు ఉంటారు. ఇలాంటివారిలో న్యూయార్క్‌కు చెందిన జోవాన్ ఒకరు. ఇతను న్యూయార్క్‌లోని బ్రూక్లైన్‌లో నివసిస్తాడు. అతనికి ఉద్యోగం లేదు. ఒకరి వద్ద పని చేయడం ఇష్టం లేదు. కానీ అతను ఆన్‌లైన్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు.

డబ్బు సమస్య వచ్చి సోషల్ మీడియా స్నేహితుల్ని అడిగాడు

డబ్బు సమస్య వచ్చి సోషల్ మీడియా స్నేహితుల్ని అడిగాడు

జోవాన్ మొదట రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఏ ఉద్యోగమూ అతనికి నచ్చలేదు. ఎంతకాలం ఉద్యోగం చేసినా ఇంతే అని భావించాడు. నచ్చిన ఉద్యోగం దొరుకుతుందేమోనని వేచిచూశాడు. కానీ అతనికి ఏదీ నచ్చడం లేదు. ఉద్యోగం లేకుంటే డబ్బులు రావు. పూట గడవదు. దానికి తోడు ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నాడు. ఓ రోజు అతనికి డబ్బుల సమస్య వచ్చింది. సోషల్ మీడియాలోని తన స్నేహితులను అడిగాడు. అడిగాడు కానీ ఎవరు ఇవ్వరు కావొచ్చునని అనుకున్నాడు.

రోజు ఆన్‌లైన్లో చాటింగ్ చేసి సరదాగా నవ్వించేవాడు

రోజు ఆన్‌లైన్లో చాటింగ్ చేసి సరదాగా నవ్వించేవాడు

కానీ అతని ట్విట్టర్ ఫాలోవర్లలో ఎంతోమంది స్పందించారు. అతనికి 400 పౌండ్లు పంపించారు. గతంలో అతను రెస్టారెంట్లో పని చేసినప్పుడు నెలకు తొమ్మిది వందలకు పైగా పౌండ్లు సంపాదించాడు. తనకు అడగ్గానే డబ్బులు ఇచ్చిన ఫాలోవర్లకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు. రోజు ఆన్‌లైన్లో వారితో చాటింగ్ చేసేవాడు. సరదాగా మాట్లాడేవాడు. వారిని సరదాగా నవ్వించాడు. కబుర్లు చెప్పాడు. అతను అలా నవ్వించడం, తమలోని ఒత్తిడిని దూరం చేయడం చాలామందికి నచ్చింది.

అడక్కుండానే డబ్బులు

అడక్కుండానే డబ్బులు

దీంతో కొందరు అతను అడగకుండానే డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. ఒకరు అతనికి ఇంటి అద్దె చెల్లించేందుకు ముందుకు వచ్చారు. జోవాన్‌కు ట్విట్టర్‌లో లక్షా పదివేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను స్వలింగ సంపర్కుడు. ఈ విషయం తెలిశాక అతనిని మరింత ఇష్టపడ్డారు. అతను ఎప్పుడు కూడా ఫాలోవర్లను ఇబ్బంది పెట్టలేదు. సెన్సాఫ్ హ్యూమర్‌తో నవ్వించేవాడు. అతనికి ఫాలోవర్లు ఒక డాలర్ నుంచి వంద డాలర్లు ఇస్తున్నారట. ఇప్పుడు అతను పని ఏమీ చేయకుండానే ఆన్‌లైన్లో సరదాగా మాట్లాడుతూ సంపాదిస్తున్నాడు. అలా నెలకు రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. ఇతనిని డిజిటల్ బెగ్గర్ అంటున్నారు.

English summary
Have you thought about live streaming and boring people with your humdrum existence? It turns out that you could make a decent amount of money just by broadcasting the mundane details of your daily life. One “influencer” is making $4,000 a month simply by live-streaming his daily life, complaining how broke he is and begging viewers to donate money to him. America is incredible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X