వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16గం.ల పాటు చలికి వణుకుతూ, ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో విమానంలోనే 250 మంది ప్రయాణీకులు

|
Google Oneindia TeluguNews

మోంట్రీయాల్: యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం కారణంగా 250 మంది ప్రయాణీకులు దాదాపు పదమూడు గంటల నుంచి పదహారు గంటల వరకు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. చలికి వణికిపోతూ నరకయాతన అనుభవించారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ కావడంతో తినేందుకు తిండి లేక అల్లాడిపోయారు. వారికి విమానం నుంచి బయటకు వచ్చే వీల్లేకుండా పోయింది.

టేకాఫ్ చేసేందుకు వీలుపడలేదు

ఈ విమానం న్యూజెర్సీలోని నెవార్క్‌‌కు వెళ్లాల్సి ఉంది. మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా కెనడాలోని గూసె బే విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అనారోగ్యానికి గురైన ప్రయాణికుడిని ఆసుపత్రికి పంపించిన తర్వాత విమానాన్ని టేకాఫ్‌ చేసేందుకు వీలు పడలేదు. ఎందుకంటే అక్కడి వాతావరణం మైనస్ 30 డిగ్రీలుగా ఉంది.

విమానం డోర్ బిగుసుకుపోయింది

విమానం డోర్ మూయబోతుండగా అది బిగుసుకుపోయింది. తలుపు బాగు చేయించేందుకు సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ప్రయాణికులు ఆ రాత్రి మొత్తం విమానంలోనే చలిలోనే వణుకుతూ ఉండిపోయారు. రాత్రివేళ కావడం వల్ల కస్టమ్స్‌ అధికారులు లేరు. దుప్పట్లు కప్పుకున్నప్పటికీ చలికి వణికిపోయారు.

మరో విమానం వద్దకు తరలింపు

మరో విమానం వద్దకు తరలింపు

ఈ విషయాన్ని విమానంలో ప్రయాణిస్తున్న సోంజయ్ డటర్సన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ఆహార పదార్థాలు, చలికి వణుకుతూ ఇబ్బందులుపడుతున్నామని, దయచేసి సాయం చేయాలని అతడు ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న సిబ్బంది ప్రయాణికులను వేరే విమానం వద్దకు తరలించారు.

English summary
A medical emergency and a mechanical problem left passengers on a United Airlines flight stuck for around 13 to 16 hours on the frigid tarmac of a Canadian airport in the plane's barely heated interior.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X