వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లఖ్వీ జైల్లో ఉండాల్సిందే: బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే ఇ తోయిబా కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్ పిటిషన్‌ను పాకిస్ధాన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది. లఖ్వీకి బెయిల్ మంజూరు చేసిన ఇస్లామాబాద్ హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ కేసును తిరిగి ఇస్లామాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ముంబై దాడులకు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీనే కారణమంటూ నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవంటూ తీవ్ర వాద వ్యతిరేక కోర్టు లఖ్వీకి డిసెంబర్ 18న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. లఖ్వీ బెయిల్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

26/11 Mastermind Zaki-ur-Rehman Lakhvi Will Not Leave Jail, Says Pakistan's Supreme Court

లఖ్వీకి బెయిల్ ఇవ్వడం పట్ల పలు ప్రపంచ దేశాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో ఆ తర్వాత రోజు ఎంపీఓ చట్ట ప్రకారం అతడిని నిర్భందంలోకి తీసుకున్నారు. ఐతే దీన్ని ఇస్లామాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో బెయిల్‌పై పాకిస్ధాన్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానికి అప్పీలుకు వెళ్లింది. దీన్ని విచారించిన పాకిస్ధాన్ సుప్రీం కోర్టు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని జైల్లోనే ఉంచాలంటూ తీర్పును వెలువరించింది.

English summary
Top Lashkar e Taiba commander, Zaki-ur-Rehman Lakhvi, accused of plotting the 26/11 Mumbai attacks, will stay in jail, Pakistan's Supreme Court has ordered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X