వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ పేలుడు: 29 మంది మృతి, 70మందికి గాయాలు

మెక్సికోలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 26 మంది మృతిచెందగా.. మరో 70 మందికి పైగా గాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

మెక్సికో: మెక్సికోలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 29 మంది మృతిచెందగా.. మరో 70 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని నగరమైన మెక్సికో సిటీలోని బాణాసంచా మార్కెట్‌లో మంగళవారం రాత్రి ఈ పేలుడు సంభవించింది.

క్షతగాత్రులను సమీపంలోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో మార్కెట్‌ కిటకిటలాడుతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి బాణాసంచా దుకాణాలు దగ్ధమయ్యాయి.

mexico blast

పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో మార్కెట్‌ మొత్తం దగ్ధమైంది. మూడు గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు.

కాగా, ఈ పేలుడు ఘటనపై మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్‌ పెనా నియోటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

English summary
At least 26 persons were killed and 70 injured in an explosion at a fireworks market outside Mexico City on Tuesday. The blast hit the San Pablito fireworks market, about 2,032km outside the city, BBC reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X