వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:న్యూయార్క్‌లో కరోనా కలవరం, 27 లక్షల మందికి వైరస్, 14 శాతం...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. సరైన పనిలేకపోవడంతో ఉద్యోగాల కోత పడుతోంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌ సహా అమెరికాలో ఉద్యోగాల కోత తప్పడం లేదు. 26 మిలియన్ల మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. న్యూయార్క్‌లో 14 శాతం మందికి వైరస్ సోకగా.. ఆ సంఖ్య 27 లక్షలుగా ఉంది.

'యాంటిబాడీ' సంస్థ 3 వేల మందిని వివిధ అంశాలపై ప్రశ్నించి.. కరోనా వైరస్ సర్వే రూపొందించింది. న్యూయార్క్‌లో ప్రస్తుతం మృతి రేటు 0.5 శాతంగా ఉంది అని.. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13.9 శాతానికి చేరితే మృతుల సంఖ్య పెరుగుతోందని సర్వే ప్రతినిధులు పేర్కొన్నారు. వైరస్ సోకుతున్న వారిలో కిరాణా షాపులో పనిచేసేవారు, ఎమర్జెన్సీ సమయంలో పనిచేసే డ్రైవర్లు ఉన్నారు. ఇంట్లో ఉన్నవారు మాత్రం వైరస్ బారినుంచి తప్పించుకుంటున్నారు.

27 Lakh New Yorkers May Have Been Infected by Coronavirus..

వైరస్ ప్రభావం లాస్ ఏంజెల్స్ కన్నా న్యూయార్క్‌లో 4.1 శాతం ఎక్కువగా ఉంది. 863 మందిపై యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా పరిశోధకులు కూడా సర్వే చేశారు. అయితే మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది అని.. కానీ వైరస్ లక్షణాలు కనబడని వారితో వ్యాధి మరింత వ్యాపిస్తోందని పేర్కొన్నారు. న్యూయార్క్‌లో సామాజిక దూరం పాటించకపోవడంతోనే వైరస్ వేగంగా ప్రబలినట్టు నిపుణులు గుర్తించారు. ప్రతీరోజు 578 మంది రోగులకు వైరస్ తగ్గి.. రోగుల సంఖ్య 15 వేల 21కి చేరిందని చెప్పారు.

Recommended Video

Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases

అమెరికాలో కరోనా వైరస్ 26 మిలియన్ల మంది ఉద్యోగులపై ప్రభావం చూపింది. ప్రతీ ఆరుగురిలో ఒకరు ఉపాది కోల్పోయారు. 1930 ఆర్థికమాంద్యం తర్వాత ఆ స్థాయిలో కరోనా ప్రభావం చూపింది. వ్యాపారం, ఆస్పత్రుల కోసం అమెరికా ప్రతినిధుల సభ 500 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
New York Governor Andrew Cuomo said a preliminary survey found that nearly 14% tested positive for antibodies against the novel coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X