వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ చేస్తుంటే అరవలేదు: జర్మనీ మోడల్‌కు కోర్టు జరిమానా

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

బెర్లిన్: అత్యాచారానికి గురైన జర్మనీ మోడల్‌కు అక్కడి న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. నిజానికి అత్యాచారానికి పాల్పడిన నిందితులకు శిక్ష విధించాల్సిన కోర్టు ఘటన జరిగిన తీరుని బట్టి అత్యాచార బాధితురాలికి 27వేల డాలర్లను జరిమానాగా విధిస్తూ తీర్పుని వెలువరించింది.

ఈ తీర్పుని జర్మన్ మహిళలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వివరాల్లోకి వెళితే... 29 ఏళ్ల జర్మన్ మోడల్ గినా-లిసా లోఫింక్‌ మద్యం మత్తులో డ్రగ్స్ తీసుకోగా ఆమెను ఇద్దరు యువకులు రేప్ చేసి వారి వద్ద ఉన్న కెమెరాల్లో షూట్ చేసి ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. దీనిపై మోడల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

medi

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులతో సహా ఆమెను కూడా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన సాక్ష్యంగా నిలిచిన వీడియోని పరిశీలించిన న్యాయమూర్తి... రేప్ జరిగిన సమయంలో బాధితురాలు సెక్స్‌ను ప్రతిఘటించలేదనే కారణంతో ఆమెనే దోషిగా నిర్ణయిస్తూ జరిమానా విధించారు.

ఈ తీర్పుపై మోడల్ గినా-లిసా లోఫింక్‌ తన ఆవేదనను వెళ్లగక్కారు. తనపై అత్యాచారం జరిగిన సమయంలో తాను డ్రగ్స్ తీసుకున్నానని, ఏం జరుగుతుందో తనకు తెలియలేదని వాపోయారు. ఈ సమయంలో నిందితులు ఫిల్మింగ్ తీసినా తానేమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నానని కోర్టు తీర్పు అనంతరం చెప్పారు.

ఈ కేసులో బాధితురాలైన తనను నిందితురాలిగా చేశారని వాపోయారు. అత్యాచారం జరిగిన సమయంలో తనను చంపేసిన కూడా ఇదే విధంగా తీర్పు వెల్లడిస్తారా? అంటూ ప్రశ్నించింది. అయితే జర్మనీలో మహిళలపై అత్యాచారాలు చేసి నిందితులు తప్పించుకోవడం ఇదేమీ కొత్తకాదు.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ఇటీవలే యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి భారీగా వలస వచ్చిన వలసదారులు జర్మన్ మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు మనం చాలానే చూశాం. ఇందుకు కారణం జర్మనీలో అత్యాచార నిరోధక చట్టాలు బలంగా లేకపోవడమే.

English summary
A 29-year-old German model was drugged and raped by two men, who filmed the scene on camera and posted it online, according to reports. Despite charges against the accused, a German court has relieved the duo with a meagre fine and levied a penalty of $ 27,000 on the victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X