వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రన్ వే పైనుంచి రోడ్డు మీదికి దూసుకొచ్చిన విమానం, మూడు ముక్కలైన ప్లైట్, ముగ్గురి మృతి..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Day Light Report : 3 Minutes 10 Headlines | Trump impeachment | Medaram Jatara | Nithyananda Bail

టర్కీలో విమానం రన్ వే నుంచి రహదారిపైకి దూసుకెళ్లింది. ఇస్తాంబుల్ సబీహ విమానాశ్రయంలో ఘటన జరిగింది. పెగాసస్ విమానయాన సంస్థకు చెందిన ప్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదం జరిగింది. రహదారిపైకి దూసుకెళ్లిన విమానం మూడు ముక్కలైంంది. విమానం కుదుపునకు గురవడంతో అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. మరో 179 మంది గాయపడ్డారు.

ముగ్గురు మృతి

ముగ్గురు మృతి

ప్రమాదంలో తీవ్రగాయలైన ముగ్గురు చనిపోయారని టర్కీ రవాణాశాఖ మంత్రి మెహ్మెత్ పేర్కొన్నారు. గాయాలైన వారి పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. విమానం మూడు ముక్కలు అవడంతో.. అందుల్లోంచి ప్రయాణికులు వచ్చినట్టు తెలుస్తోంది. రన్ వేపై ప్రమాదం నేపథ్యంలో.. ఇతర విమానాల రాకను నిలిపివేసినట్టు మంత్రి తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందితో కలిసి 183 మందితో విమానం బయల్దేరిందని పేర్కొన్నారు.

18 ఆస్పత్రుల్లో చికిత్స

18 ఆస్పత్రుల్లో చికిత్స

177 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిసి ఇజ్మిర్ నుంచి విమానం బయల్దేరిందని ఇస్తాంబుల్ గవర్నర్ అలి యెర్లికయ తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రులకు 18 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో వాతావరణ పరిస్థితులు బాగోలేదని, అందుకే అదుపుతప్పి పోయి ఉంటుందని తెలిపారు. రన్ వే నుంచి 60 మీటర్ల వరకు రోడ్డుపైకి రావడంతో ప్రమాదం జరిగిందన్నారు.

 గాలి వీయడంతోనే..?

గాలి వీయడంతోనే..?

ఫుటేజీలో మాత్రం రన్ వే పైకి వస్తోన్న సమయంలో విమానం హై స్పీడ్‌లో ఉంది. రన్ వే నుంచి 40 మీటర్ల దూరం వరకు గల రోడ్డుపైకి దూసుకొచ్చింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా గాలి వీచింది. అంతకుముందు రెండు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించలేదు. కానీ పెగాసస్ విమానానికి పర్మిషన్ ఇవ్వడంతో ప్రమాదం జరిగిందనే అనుమనాలు కూడా తలెత్తుతున్నాయి.

English summary
A Pegasus Airlines plane flying into Istanbul’s Sabiha Gokcen airport skidded off the end of the wet runway and broke into three pieces after landing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X