వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా : అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో ఫుడ్ ఫెస్టివల్ టార్గెట్‌గా ఓ ఆగంతకుడు కాల్పలకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు

ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మర్ ఫుడ్ ఫెస్టివల్‌గా పేరొందిన గిల్ రే ఫుడ్ ఫెస్ట్‌ ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఆదివారం ఫెస్ట్ చివరి రోజున ఆగంతకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తొలుత పటాకులు పేలుస్తున్నారని భావించిన సందర్శకులు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

3 Killed, 12 Injured as Shooter Opens Fire at California Food Festival

30 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైఫిల్‌లో వచ్చిన దుర్మార్గుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడని అంటున్నారు. ప్లాన్ ప్రకారమే అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. కాల్పుల విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. నిందితుని కోసం వేట కొనసాగిస్తున్నారు.

కాలిఫోర్నియా కాల్పుల ఘటనపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ సూచించారు.

English summary
Three people have been killed and 12 others are injured after a shooting at a festival in Gilroy, California. Witnesses reported confusion and panic as shots rang out at the festival in the city of 50,000 located about 80 miles southeast of San Francisco.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X