వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

స్టాక్హొం: ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు లభించింది. వైద్యరంగంలో విశిష్ట కృషికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్‌ పురస్కారం వరించింది. విలియమ్ సి.క్యాంబెల్ (ఐరిష్), సతోషి ఒమురా (జపాన్), య్యూయు తు (చైనా) లకు ఈ పురస్కారం దక్కింది.

మలేరియా, తామరపై వీరు చేసిన పరిశోధనలకుగాను వారికి ఈ గౌరవం దక్కినట్లు నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. దోమలు, ఈగలు వల్ల మానవ రక్తంలో ప్రవేశించే బ్యాక్టీరియా, ఏలికపాము లాంటి పరాన్న జీవుల కారణంగా సంక్రమించే బోదకాలు, అంధత్వం నయంచేసేందుకు డ్రగ్‌ను కనుగొన్నందుకుగాను విలియమ్ సి.క్యాంబెల్, సతోషి ఒమురాలకు సంయుక్తంగా సగం నోబెల్ ప్రైజ్ లభించింది.

3 researchers share Nobel Prize for medicine

మలేరియాను అరికట్టే మెడిసిన్ 'ఆర్టేమిసినిన్'ను కనుగొన్న చైనాకు చెందిన మహిశా శాస్త్రవేత్త య్యూయు తునకు మిగతా సగం నోబెల్ ప్రైజ్ మనీ ఇవ్వాలని అవార్డు కమిటీ నిర్ణయించింది. చైనా అకాడమీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్' విభాగంలో పనిచేస్తూ చైనా సంప్రదాయ ఔషధ మొక్కల నుంచి ‘ఆర్టెమెసినిన్' అనే డ్రగ్‌ను 84 ఏళ్ల య్యూయు తు కనుగొన్నారు.

1930లో జన్మించిన ఆమె 1967లో మావో జెడాంగ్ ఏర్పాటు చేసిన మలేరియా డ్రగ్ ప్రాజెక్టులో చేరారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును 523 అని పిలిచేవారు. రహస్యంగా జరిగిన ఈ పరిశోధనల్లో ఆమె స్వయంగా శరీరంలోకి మలేరియా పరాన్న జీవిని ఎక్కించుకున్నారు. తన ఏకైక కూతురును నర్సరీ హోంలో వదిలేసి ప్రాజెక్టులో పాల్గొన్నారు.

Scientist William Campbell

ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట డిసెంబర్ 10న ఆయన వర్ధంతి సందర్భంగా స్వీడిష్ అకాడమీ ఈ బహుమతులను అందజేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Irish-born William Campell, China's Tu Youyou and Japan's Satoshi Omura won the 2015 Nobel Prize for physiology or medicine, it was announced on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X