వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోమ్: వివిధ రంగాల్లో పరిశోధనలకు ప్రతి ఏటా ప్రకటించే నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం నాడు ప్రారంభమైంది. తొలుత వైద్యరంగానికి నోబెల్ ప్రకటించారు. అమెరికాకు చెందిన ముగ్గురికి ఈ నోబెల్ పురస్కారం ప్రకటించారు. జెఫ్రీ సి.హాల్, హైకెల్ రోస్ బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్‌కు ఈ నోబెల్ అవార్డు అందించనున్నట్టు నోబెల్ అవార్డుల కమిటీ ప్రకటించింది.

శరీరంలోని అణువులు మానవ జీవక్రియల, మానసిక ఉద్వేగాల మార్పులను ఏ విధంగా తమ అధీనంలో ఉంచుకుంటాయో వివరించినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించింది.

మొక్కలు, జంతువులు, మనుషులు ప్రకృతిలో జరిగే మార్పులను తమలో ఎలా ఇముడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాయో వీరి పరిశోధనల్లో వివరించినట్టు స్వీడెన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నోబెల్ అసెంబ్లీ ఒక ప్రకటనలో పేర్కొంది.

3 US born scientists win Nobel Prize for Medicine

నోబెల్ అవార్డు కింద విజేతలకు 9 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (11 మిలియన్ డాలర్లు) అందిస్తామని ప్రకటించింది. ఏటా వైద్యరంగంలో పరిశోధనలను గాను తొలుత నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు.

సైన్సు, సాహిత్యం, శాంతికి పాటుపడిన వ్యక్తులకు ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త, వాణిజ్యవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1901లో ఈ అవార్డులను ప్రారంభించారు.

English summary
US born scientists Jeffrey Hall, Michael Rosbash and Michael Young won the 2017 Nobel Prize for Physiology or Medicine for their discoveries of molecular mechanisms controlling our biological clocks, the award-giving body said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X